ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నేతల తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఇప్పటికే తీవ్ర ఆరోపణలు వస్తుండగా తాజాగా మరో కలకలం తెరమీదకు వచ్చింది. అధికార పార్టీకి చెందిన నేత ఒకరు ఓ సామాన్యురాలికి ఉద్యోగ అవకాశం ఇప్పటిస్తానని చెప్పి లోబర్చుకున్న తీరు ఏపీ రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదం అయింది. ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
సదరు బాధితురాలు సోమాజిగూడలో విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత - ఆప్కో చైర్మెన్ గుజ్జల శ్రీనివాస్ తండ్రి రామకృష్ణ ఆ బాధితురాలికి ఉద్యోగం ఎర చూపారు. నమ్మి ఆయన్ను ఆశ్రయించిన బాధితురాలిని లోబర్చుకున్నాడు. అనంతరం ఉద్యోగం కల్పించకపోగా...ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలతో బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని లేకపోతే...సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తానని బెదిరించాడు. తనకు జరిగిన అన్యాయం గురించి కడప వన్ టైన్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేయగా...పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
టీడీపీ నాయకుడు తనపై అఘాయిత్యానికి పాల్పడటం - బెదిరింపులకు దిగడం - పోలీసులు సైతం తనకు న్యాయం చేయని నేపథ్యంలో తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆ యువతి కన్నీటి పర్యంతం అయింది. టీడీపీ నేత - ఆప్కో చైర్మెన్ గుజ్జల శ్రీనివాస్ తండ్రి రామకృష్ణ తన వలే చాలామందిని మోసం చేశాడని ఆయన ఆగడాలను అడ్డుకోవాలని కోరింది. ఉద్యోగాల ఆశచూపి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకుంది.