ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం అంటే ప్రభుత్వానికి సంబంధించి కీలక చర్చలు - నిర్ణయాలు తీసుకునే, ప్రకటించే ప్రభుత్వ కేంద్రం. అక్కడ పార్టీపరమైన కార్యకలాపాలు చేయడం నిషిద్ధం. కానీ, ఏపీ సీఎం కార్యాలయం మాత్రం పార్టీ ఆఫీసులా మారిపోయింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నా టీడీపీ మంత్రులు - నేతల తీరు మారడం లేదు. విజయవాడలోని ఏపి సిఎం క్యాంపు కార్యాలయం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు - మంత్రులకు ప్రచార వేదికగా మారుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లే గేటు లోపల సమాచారశాఖ మీడియా రూమును ఏర్పాటుచేసింది. సహజంగా మంత్రులు అక్కడ మీడియాతో భేటీ అయి - ప్రభుత్వ కార్యక్రమాలు - మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడిస్తుంటారు. సిఎం తన కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన్ను కలిసే వివిధ వ్యక్తులు ఇచ్చే వినతి పత్రాలను మీడియాకు ఇక్కడే చేరవేస్తారు. కానీ కాపు ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి, క్యాంపు కార్యాలయం టిడిపి కార్యాలయంగా మారిందన్న విమర్శలు పెరిగినా, సమాచారశాఖ దానిని పట్టించుకోవడం లేదు. కాపు ఉద్యమ సమయంలో టిడిపికి చెందిన కాపు ఎమ్మెల్యేలంతా - ప్రతిరోజూ సీఎంఓలోని మీడియా సెంటర్ లోనే సమావేశం నిర్వహించి, ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం - ఆయనను మద్దతునిస్తోన్న ఇతర పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. బిజెపి-టిడిపి మధ్య మాటల యుద్ధానికి సైతం సీఎంఓ మీడియా సెంటర్ వేదికయింది. అంతేకాదు... టిడిపి ఎమ్మెల్యేలు మీడియా సెంటర్‌లో విలేకరుల సమావేశాలు నిర్వహించే సమయంలో అక్కడ గోడలపై అంతకుముందు నుంచి ఉండే సమాచారశాఖ బ్యానర్లు అలాగే కనిపిస్తున్నాయి. దీంతో పార్టీ వాయిస్ ప్రభుత్వ వాయిస్ గా వినిపిస్తున్నట్లవుతోంది. టీడీపీ నేతలు పార్టీ వైపు నుంచి మాట్లాడినా బ్యాక్ గ్రౌండ్ లో సమాచార శాఖ బ్యానర్లు కనిపిస్తే అది ప్రభుత్వం చెబుతున్నట్లే అనుకోవాల్సి ఉంటుంది.
అసలు ప్రభుత్వ అధికార కేంద్రంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రెస్ కాన్ఫరెన్సును అడ్డుకోవలసిన అధికారులు అలా చేయడం మానేసి ఫలానా సమయంలో టీడీపీ ఎమ్మెల్యే మీడియా సమావేశం ఉందంటూ జర్నలిస్టులకు ఎస్ ఎంఎస్ లు పంపిస్తుండడంపైనా విమర్శలొస్తున్నాయి. వారు గవర్నమెంటు పీఆర్వోలా లేదంటే టీడీపీ పీఆర్వోలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విజయవాడలో టీడీపీ ఆఫీసు ఉన్నప్పటికీ, దానిని వినియోగించుకోకుండా, సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే... సీఎం కార్యాలయాన్ని ఇలా పార్టీ ఆఫీసులా మార్చేయడం వెనుక కొందరు ఎమ్మెల్యేల పాత్ర ఉందని తెలుస్తోంది. పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్లు పెడితే ఎవరూ రావడం లేదని, క్యాంపు ఆఫీసులోనయితే అంతా ఉంటారు కాబట్టి అక్కడ పెడితే అంతా వస్తారన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు అలా చేస్తున్నారని తెలుస్తోంది. వారి వ్యవహార శైలి కారణంగా సీఎంఓపై మచ్చ పడుతోంది.