సిత్తరాల సిరపడు పాటపై టీడీపీ ఎంపీ ట్వీట్

Update: 2020-01-19 05:10 GMT
సినిమాల్లో ప్రయోగాలకు వచ్చే ఫలితం మామూలుగా ఉండదు. పాజిటివ్ అయితే ఫర్లేదు కానీ.. నెగిటివ్ అయితే మాత్రం మొదటికే మోసం ఖాయం. సాధారణంగా అగ్ర కథానాయకుల సినిమాల్లో క్లైమాక్స్.. అది కూడా దారుణమైన విలనిజాన్ని ప్రదర్శించే విలన్ అండ్ ను దుమ్మ దులిపేలా చితక్కొట్టేయాల్సిన స్థానే..గ్రామీణ యాసలో ఒక పాట పెట్టి.. స్టైలీష్  ఫైట్ డిజైన్ చేస్తే.. దానికి ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందన్నది పెద్ద ప్రశ్నే.

సినిమా విడుదలకు ముందు కనీసం దీని గురించి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా అల వైకుంఠపురం టీం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని మిగిల్చిందని చెప్పాలి. రోటీన్ కు భిన్నంగా ఉన్న ఈ క్లైమాక్స్ ఫైట్ మీద కొందరు పెదవి విరిచినా.. చాలామంది మాత్రం సరికొత్తగా ఫీల్ అయ్యారని చెప్పాలి. నిజానికి అల సినిమాలో సిత్తరాల సిరపడు పాట నేపథ్యంలో వచ్చే సీన్లను ప్రేక్షకులు మస్తుగా ఎంజాయ్ చేయటమే కాదు.. ఈ కొత్త ట్రీట్ మెంట్ పై పలువురు అభినందిస్తున్నారు.

మూస ధోరణికి చెక్ పెట్టేలా దర్శకుడు త్రివిక్రమ్ వ్యవహరించారని పలువురు చెబుతున్న వేళ.. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ రియాక్ట్ అయ్యారు. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో సిత్తరాల సిరపడు సాంగ్ పైన కామెంట్ పోస్టు చేశారు. ‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు.. పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు.. ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు’ అంటూ శ్రీకాకుళం యాసలో వచ్చే ఈ అచ్చతెలుగు జానపద గేయాన్ని ఎల్ ఐసీలో సీనియర్ ఉద్యోగి బల్లా విజయకుమార్ రాశారు. దీనిపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు రియాక్ట్ అవుతూ.. తమ జిల్లా సంస్కృతి.. సాహిత్యం తెలుగువారికి తెలిసేలా చేసిన దర్శకులు.. రచయత.. గేయకర్తకు థ్యాంక్స్ చెప్పారు. ఈ పాటకు అల్లు అర్జున్ స్టైలీష్  ఫైట్ పర్ ఫెక్టుగా సరిపోయిందని యువ ఎంపీ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News