బీజేపీ కోసం... టీడీపీ విశ్వ ప్ర‌య‌త్నం.. ఎందుకింత దూకుడు...!

Update: 2022-09-13 23:30 GMT
బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకురాష్ట్రంలోని టీడీపీ పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తోందనే విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు నుంచి కీల‌క నేత‌ల వ‌ర‌కు..కేంద్రంలోని బీజేపీని సానుకూల ప‌రిచేందుకు.. టీడీపీతో చేతు లు క‌లిపేందుకు.. ముందుకురావాల‌నే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న ఉంది. ఇటీవ‌ల చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లోనూ.. మోడీతో భేటీ వెనుక వ్యూహం ఇదేనని అంటున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బ‌లంగా వ్య‌తిరేకించిన బీజేపీతో చంద్ర‌బాబు ఎందుకు స‌మైక్యం కోరుకుంటున్నారు? అనేది ప్ర‌శ్న‌.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు .. రాజ‌ధానికి నిధులు ఇవ్వ‌లేద‌ని.. ప్యాకేజీ ఇచ్చి మోసం చేశార‌ని.. ప్ర‌త్యేక హో దా ఎందుకు ఇవ్వ‌ర‌ని.. ప్ర‌శ్నించిన చంద్ర‌బాబు.. బీజేపీపై గ‌తంలో ఏపీలో ఎవ‌రూ చేయ‌ని విధంగా పెద్ద యుద్ధ‌మే చేశారు. మ‌రి ఇప్పుడు మాత్రం ఆయ‌న బీజేపీస్నేహాన్ని ఆకాంక్షిస్తున్నారు. దీనివెనుక కొన్ని రీజ‌న్లు ఉన్నాయ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. కేంద్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి మోడీనే అధికారంలోకి వ‌స్తార‌నేది.. చంద్ర‌బాబు అంచ‌నా. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా కూడా మోడీ ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయి.

దీంతో కేంద్రంలో కాంగగ్రెస్ వ‌చ్చే ప‌రిస్థితి లేదని, సో.. మోడీకే ప్ర‌జ‌లు మ‌ళ్లీ ప‌ట్టం క‌డ‌తార‌ని.. చంద్ర‌బా బు భావిస్తున్నారు. ఓకే.. దీనివ‌ల్ల చంద్ర‌బాబుకువ చ్చే లాభం ఏంటి? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. కేంద్రంలో అధికారంలో వ‌చ్చే పార్టీతో స‌ఖ్య‌త‌గా ఉండాల‌ని.. త‌ద్వారా.. ఏపీకి అంతో ఇంతో నిధులు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంద‌ని.. ఏపీలోనిమేధావి వ‌ర్గం భావిస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్రంలో స‌ఖ్య‌త‌గా మెలిగిన వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఇక‌, ఇదే త‌ర‌హాలో.. చంద్ర‌బాబు కూడా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. ఇక‌, మ‌రో కార‌ణం ఏంటంటే.. ప్ర‌స్తుతం ఏపీకి ప్ర‌త్యేక హోదా రావాల‌న్నా.. ఇతర నిధులు రావాల‌న్నా..కేంద్రం స‌హ‌క‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. పోనీ..ఇవేవీ కాక‌పోయినా.. కేంద్రంతో స‌ఖ్య‌త గా ఉన్నామ‌నే సంకేతాలు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు పంపించాల్సి ఉంది. ఇదే వ్యూహంతో వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీని క‌లుపుకొని పోయింది. ఇప్పుడు ఇదే సూత్రాన్ని పాటించాల‌నేది చంద్ర‌బాబు ఉద్దేశంగా ఉంది.

అందుకే ఏమాత్రం ఓటు బ్యాంకు లేని.. బీజేపీతో ఆయ‌న క‌లిసిప‌నిచేయాల‌ని భావిస్తున్నారు. అంతేకాదు.. తెర‌వెనుక మ‌రో కోణం కూడా ఉంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జ‌న‌సేన పార్టీ టీడీపీకి నేరుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తే.. బ్యాడ్ సంకేతాలు వెళ్లే ప్ర‌మాదం అంచనా వేస్తున్నారు.

అదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. ఎలానూ.. బీజేపీతో క‌లిసి ఉన్న నేప‌థ్యంలో జ‌న‌సేన ఆటోమేటిక్‌గా టీడీపీకి కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తే.. ఏదైనా తేడా కొట్టినా.. ఇబ్బంది లేకుండా పోతుంద‌నేది మ‌రో వ్యూహంగా ఉంద‌ని చెబుతున్నారు. మొత్తంగా అనేక కార‌ణాలు.. అంచ‌నాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు బీజేపీవైపు మొగ్గుచూపుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News