ఇప్పుడిప్పుడే.. ప్ర‌జ‌ల్లోకి.. టీడీపీలో ఆనందం..!

Update: 2022-11-30 05:49 GMT
'ఇదేం ఖ‌ర్మ ఈ రాష్ట్రానికి' నినాదంతో వైసీపీ ప్ర‌భుత్వంపై యుద్ధం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీకి ఇప్పుడిప్పుడే సానుకూల ప‌రిణామాలు ఎదుర‌వుతున్నాయి. ఇంకా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌లేదు. అయితే.. సోష‌ల్ మీడియాలో మాత్రం దీనిని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంది? అనే దానిపై టీడీపీ అభిప్రాయాలు సేక‌రిస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా అందిన ఫీడ్ బ్యాక్ ప్ర‌కారం.. బాగానే ఉంద‌ని స‌మాచారం అందిన‌ట్టు తెలిసింది.

గ‌త ప్ర‌భుత్వం అంటే.. టీడీపీ చేప‌ట్టిన అనేక కార్య‌క్ర‌మాల‌ను ఈ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. వాటిని ఉటంకిస్తూ.. ఐటీడీపీ వింగ్ ఈ ప్ర‌చారం చేసింది. ''అప్ప‌ట్లో ఐదురూపాయ‌ల‌కే అన్నం. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చినా సున్నం.. ఇదేం ఖ‌ర్మ ఈ రాష్ట్రానికి''- ''అప్ప‌ట్లో ముస్లిం యువ‌తుల పెళ్లిళ్ల‌కు కానుక‌లు ఇచ్చేందుకు ష‌ర‌తులు లేవు. ఇప్పుడు టెన్త్ పాస్‌. ఆర్ధిక స్థాయి వంటివి చూపించాల్సి వ‌స్తోంది. ఇదేం ఖ‌ర్మ ఈ రాష్ట్రానికి'' అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వీటికి సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి యువ‌త వ‌ర‌కు కూడా మంచి స్పంద‌న వ‌స్తోంది. ఆయ పోస్టుల‌కు లైకులు.. కామెంట్లుకూడా పెరుగుతున్నాయి. దీంతో ఇదేం ఖ‌ర్మ ఈ రాష్ట్రానికి అనేనినాదంపై కొంత వ‌ర‌కు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డిన పార్టీ, తాజాగా స‌మాచారంతో ఒకింత ఊపిరి పీల్చుకుంటున్న‌ట్టు అయిందని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మ‌రోవైపు, ఈ కార్య‌క్ర‌మాన్ని జిల్లాల్లో మ‌రింత ప్ర‌చారం చేసేందుకు ఐటీడీపీకే బాధ్య‌త‌లు ఎక్కువ‌గా అప్ప‌గించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఖ‌ర్మ కార్య‌క్ర‌మం ప్రారంభం కాకుండానే ఇది స‌క్సెస్ అయింద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. గ‌త ఏడాది కాలంలో రెండు కీల‌క కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఒక‌టి బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం.

ఇప్పుడు ఖ‌ర్మ‌.బాదుడే బాదుడు ప్ర‌జ‌ల్లోకి బాగానే వెళ్లింది. ముఖ్యంగా మాస్‌ను బాగానే ఆక‌ట్టుకుంద‌ని అంటున్నారు. ఇప్పుడు ఖ‌ర్మ కూడా అదే రేంజ్‌లో ఉంటుంద‌ని అంటున్నారు. మొత్తానికి తాజా ప‌రిణామాల‌తో టీడీపీలో జోష్ పెరిగింద‌ని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News