కరోనా.. గురించి అందరికీ తెలిసిందే. ఇది వచ్చిన వారిని పదిమందీ చేరనివ్వరు.. వచ్చిన వారు కూడా పదిమందికీ దూరంగా ఉంటారు. ఇప్పుడు ఇలాంటి వారితోనే టీడీపీ సతమతం అవుతోంది. అనేక నియో జకవర్గాల్లో టీడీపీ పరిస్థితి ఇలానే ఉంది. సీనియర్ నాయకులు పార్టీకి గుదిబండలుగా మారారనే వాదన వినిపిస్తోంది. ఒకవైపు.. పార్టీని పరుగులు పెట్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఈ పరుగులకు సీనియర్లు మోకాలడ్డుతున్నారు.
ఉదాహరణకు తుని నియోజకవర్గాన్ని తీసుకుంటే.. ఇక్కడ యనమల రామకృష్ణుడు తప్ప.. మరెవరూ.. పార్టీ తరఫున మాట్లాడేందుకు పేటెంట్ లేదు..అ న్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని అనంత అర్బన్, తాడిపత్రి నియోజకవర్గాల్లోనూ జేసీ వర్గమే హవా చలాయిస్తోంది. ఇక్కడ యువత ను తెరమీదికి రానివ్వరు.. పోనీ..వారైనా పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారా? అంటే అది కూడా లేదు. దీంతో ఇక్కడ టీడీపీ గురించి పట్టించుకునేవారు లేకుండా పోయారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో నాయకులుయాక్టివ్‌గానే ఉన్నా.. కీలకమైన ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రి వంటి నియోజకవర్గాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇక్కడకూడా యువత యాక్టివ్ అవ్వాలని చంద్రబాబు ఇటీవలే చెప్పారు.
వారు కూడా సిద్ధంగానే ఉన్నారు. కానీ, సీనియర్ నాయకులే అన్నీ అయి చక్రం తిప్పుతున్నారు. అయితే.. వీరివల్ల పార్టీ బలపడుతోందా? అంటే.. అది లేకుండా పోయింది. ఇక, చిత్తూరులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
కేవలం సీనియర్లు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. లేదా.. పార్టీ గురించిన ప్రస్తావనే లేకుండా పోతోంది. మరి ఇదే పద్ధతి కొనసాగితే.. పార్టీ పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారింది. వారు ఎదగరు.. ఎదుగు తున్నవారిని ప్రోత్సహించకపోగా.. అడ్డుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
దీంతో టీడీపీలో ఒక సతమతమైన పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు..కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితి ఉందో.. ఇప్పుడు కూడా అంతే అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.