ఆ ఐపీఎస్ అధికారికి నా భార్య‌తో!

Update: 2018-07-16 04:15 GMT
బెంగ‌ళూరుకు చెందిన ఒక టెకీ చేసిన ఫిర్యాదు పోలీసు వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. సంచ‌ల‌నంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే క‌ర్ణాట‌క‌లోని దేవాంగెరె ప్రాంతానికి చెందిన ఒక ఐటీ ఉద్యోగికి 2010లో ఒక యువ‌తిని పెళ్లాడి.. అమెరికాకు తీసుకెళ్లాడు. అక్క‌డ కొన్నేళ్లు ఉండి తిరిగి స్వ‌దేశానికి వ‌చ్చేశారు.

దేవాంగెరె ప‌ట్ట‌ణంలో ఒక గ్రాఫిక్ డిజైనింగ్ స్టూడియోను టెకీ భార్య స్టార్ట్ చేశారు. ఒక రోజు ఐపీఎస్ అధికారి ఒక‌రు ఫోటో షూట్ కోసం వ‌చ్చారు. అలా మొద‌లైన ప‌రిచ‌యం త్వ‌రగా ముదిరి పాకాన ప‌డింద‌న్న‌ది ఆరోప‌ణ‌. త‌న భార్య‌తో ప‌రిచ‌యం పెంచుకొని అక్ర‌మ సంబంధాన్ని పెట్టుకున్నాడ‌ని.. ప‌లుచోట్ల వారు క‌లిసి తిరుగుతున్నార‌ని.. త‌న భార్య‌ను ముద్దాడిన వీడియోను తాను చూసిన‌ట్లు ఆరోపించారు.

త‌న భార్య ఆఫీసులోనూ.. కాఫీ షాపుల్లోనూ.. త‌దిత‌ర ప్రాంతాల్లో త‌న భార్య‌తో క‌లిసి తిరుగుతున్న స‌ద‌రు అధికారి తీరుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. ఈ విష‌య‌మైన త‌న భార్య‌ను మంద‌లిస్తే కొంత‌కాలం ఆమె కామ్ గా ఉంద‌ని.. మ‌ళ్లీ ఇప్పుడు వారి ప్రేమక‌లాపాలు మ‌ళ్లీ షురూ అయిన‌ట్లుగా అత‌డు చెబుతున్నాడు.

ఐపీఎస్ అధికారిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే.. త‌న‌ను బెదిరిస్తున్నార‌ని.. ఎన్  కౌంట‌ర్ చేస్తాన‌ని వార్నింగ్ ఇస్తున్న‌ట్లు చెప్పాడు.  త‌న భార్య‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న ఐపీఎస్ అధికారిపై రాష్ట్ర డీజీపీకి తాను ఫిర్యాదు చేసిన‌ట్లు చెప్పారు. అయినా.. త‌న ఫిర్యాదుపై ఎలాంటి చ‌ర్యా తీసుకోలేద‌ని.. త‌న‌కున్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్ర‌యించారు. ఇదిలా ఉంటే.. త‌న భ‌ర్త‌తో విభేదాల‌తో విడిపోయాన‌ని.. తానిప్పుడు వేరుగా ఉంటున్న‌ట్లు ఆమె చెబుతున్నారు. త‌న భ‌ర్త చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌ద‌రు భార్య చెప్ప‌టం కొస‌మెరుపుగా మారింది.

Tags:    

Similar News