భారీ ఆదాయం వచ్చి బినామీ ఖాతాల్లోకి పోతుందన్న ఆరోపణపై తీన్మార్ మల్లన్న ఏమన్నారు?
తెలంగాణ రాజకీయ తాజా సంచలనం తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు విన్నంతనే గయ్యిమని లేవటమే కాదు.. తిట్ల పురాణం మొదలు పెడతారు. మరీ.. ఇంత గలీజుగా మాట్లాడతారేందని ప్రశ్నిస్తే.. దానికి ఫైర్ అవుతాడు. తాను మాట్లాడిన మాటలన్ని సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలని.. పెద్ద సారు నోటి నుంచి వచ్చే మాటలు..ఆయన వాడే పదాల్నే వాడతానని.. కాకుంటే కాస్త ఎక్కువగా వాడతానని క్లారిటీ ఇస్తాడు.
తాజాగా జరుగుతున్న నల్గొండ.. ఖమ్మం.. వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్యంగా రెండోస్థానంలో ఆయన.. తెలంగాణ సమాజంలో హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియాలో తన వీడియోలతో నిత్యం అలరించే ఆయన.. తరచూ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తుంటారు. ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని అదే పనిగా విమర్శించటమే కాదు.. లోపాల్ని తనదైన శైలిలో ఎత్తి చూపిస్తుంటారు. గతంలో కాంగ్రెస్.. టీజేఎస్ లతో పని చేయటమే కాదు.. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న ఆయన.. తాజా ఎన్నికల్లో అందుకు భిన్నంగా.. భారీగా ఓట్లను రాబట్టుకొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం కంటే కూడా ఎక్కువ ఓట్లను తీన్మార్ మల్లన్న సొంతం చేసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. కేసీఆర్ సర్కారుపై అదే పనిగా విమర్శలు చేసే మల్లన్న మీద ఎలాంటి ఆరోపణలు లేవా? అంటే ఉన్నయని అంటారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక సూటి ప్రశ్న ఎదురైంది.
వివిధ మార్గాల్లో మీకు భారీగా ఆదాయం వస్తోందని.. అదంతా మీ కుటుంబ సభ్యుల పేరుతో బినామీ ఖాతాల్లోకి వెళుతుందని గతంలో మీతో పని చేసిన సభ్యులు విమర్శిస్తారు కదా? అని ప్రశ్నిస్తే.. తీన్మార్ మల్లన్న సమాధానం ఏమని చెప్పారంటే.. ‘‘తీన్మార్ మల్లన్న అనేవాడు ప్రజలకు బాండ్ రాసిస్తాడు. నేను చనిపోయాక నా శవంపై అంగి లాగు ఉండాలే తప్ప.. జేబులో ఒక్క రూపాయి కూడా ఉండొద్దు. రాష్ట్ర ప్రభుత్వం నాకు డబ్బులిచ్చి లొంగదీసుకోవాలని చూసింది. కేసులు పెట్టారు. దాడులు చేశారు. డబ్బులు రావటం.. బినామీ ఖాతాల్లోకి జమ కావటం ఒక్కటంటే.. ఒక్క ఆధారం చూపించినా.. దేనికైనా సిద్ధం’’ అని బదులివ్వటం గమనార్హం.