సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో అత్యంత బలమైన రాజకీయ నేత మోడీ రూపంలో రావటం తెలిసిందే. మోడీకి ముందు పలువురు ప్రధానమంత్రులుగా పని చేశారు కానీ.. వారందరికి లేనిది.. మోడీకి మాత్రమే ఉన్నది జనాకర్షణ. ఇందిర తర్వాత అంతటి ఇమేజ్ ను సొంతం చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. తాను టార్గెట్ చేసిన రాజకీయ ప్రత్యర్థులపై ఆమె తరహాలోనే మోడీ విరుచుకుపడటం కనిపిస్తూ ఉంటుంది. వీలైతే స్నేహం చేయాలే కానీ యుద్ధం చేస్తానంటే వారి లెక్క తేల్చేందుకు ఎంతదూరమైనా వెళ్లాలన్నట్లుగా మోడీ తీరు ఉంటుందని చెబుతారు.
టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలోనే కాదు.. మోడీ మీద కత్తి దూసిన అధినేతలు తర్వాతి కాలంతో కామ్ గా ఉండటం కనిపిస్తూ ఉంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా ఉండే అరవింద్ కేజ్రీవాల్ సైతం మొదట్లో మోడీని కెలకటం.. తర్వాత ఆయన్ను టచ్ చేయటం మానేసి..రూట్ మార్చేసి వెళ్లిపోవటం తెలిసిందే. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి ఫైర్ బ్రాండ్ అధినేత్రి సైతం మిగిలి వారితో తలపడినట్లుగా మోడీతో తలపడకూడదన్న విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించారనే చెప్పాలి. ఈ కారణంతోనే ఆమె వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను నోరు విప్పితే.. తనకే ఇబ్బంది అన్న విషయాన్ని ఆమె అర్థం చేసుకున్నట్లు చెబుతారు.
తనను టార్గెట్ చేసిన క్రమంలో తన మంత్రివర్గంలోని మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్టు చేయటం.. కోట్లాది రూపాయిల నోట్ల కట్టల్ని దేశానికి చూపించటం ద్వారా అవాక్కు చేసిన పరిస్థితి. స్కూల్ సర్వీస్ కమిషన్ స్కామ్ లో అతడి భాగస్వామ్యాన్ని.. అతడికి సన్నిహితంగా ఉంటే నటి ఇంట్లో కట్టల చొప్పున నోట్లను చూపించటం.. ఆ మొత్తాన్ని సీజ్ చేయటం ద్వారా ఆయన్ను అరెస్టు చేశారు. ఇదంతా తనను దెబ్బ తీసే స్కెచ్ లో భాగంగానే అన్న విషయం దీదీకి తెలిసినా.. వాతావరణం తనకు అనుకూలంగా లేనప్పుడు మౌనానికి మించిన మందు మరొకటి ఉండదన్న సత్యాన్ని ఆమె గుర్తించారనే చెప్పాలి. ఆ మాటకు వస్తే.. అలాంటి తెలివి తన రాజకీయ ప్రత్యర్థులకు వచ్చేలా చేయటంలో మోడీ తర్వాతే ఎవరైనా అని చెప్పక తప్పదు.
అలాంటి మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుకోవటం తెలిసిందే. తనకు తాను ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ప్రధాన మంత్రి పదవిలో ఉన్న మోడీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు.. నమోకు ఆగ్రహాన్ని కలిగించాయని చెబుతున్నారు. తనను ఎవరూ అనని మాటల్ని అన్న కేసీఆర్ కు సరైన గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో మోడీ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి.
ఇంతకాలం కేసీఆర్ ను టార్గెట్ చేసిన వారిని చూసినప్పుడు.. వారంతా ఆయన బలాన్ని తక్కువగా అంచనా వేసి గోదాలోకి దిగినోళ్లు. మోడీ మాత్రం అందుకు భిన్నంగా కేసీఆర్ బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకొని మరీ గోదాలోకి దిగినట్లుగా చెబుతారు. ఈ కారణంతోనే ఇప్పటివరకు తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అనుసరించిన వ్యూహాన్ని కాకుండా.. భిన్నమైన ప్లాన్ తో గులాబీ బాస్ ను దెబ్బ తీయాలన్నది మోడీ ప్లానింగ్ గా చెబుతారు.
మమతా బెనర్జీ లాంటి నేతనే మడతపెట్టేసిన మోడీకి కేసీఆర్ పెద్ద లెక్క కాదన్న మాట కమలనాథుల నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే.. మోడీకి సన్నిహితంగా ఉన్న వారు మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యల్నిచేస్తారు. కేసీఆర్ అపారమైన మేధావిగా మోడీ భావిస్తారని చెబుతారు. అతడి తెలివి విషయంలో మోడీకి ఒక అంచనా ఉందని.. ఆయన విషయంలో ఏ మాత్రం తొందరపాటు పనికి రాదన్న విషయంలో మోడీ అప్రమత్తంగా ఉంటారని చెబుతారు. ఈ కారణంతోనే.. తన మీద కేసీఆర్ చేసే తప్పుల్ని ఓపిగ్గా వేచి చూసి.. చక్కటి గుణపాఠం చెప్పేలా చేస్తారంటారు. దీనికి సంబంధించి ఆట ఇప్పటికే మొదలైందన్న మాట వినిపిస్తోంది. మరి.. కేసీఆర్ ను తాను అనుకున్నట్లుగా మోడీ చేయగలుగుతారా? అన్నది కాలమే సరైన సమాధానం చెబుతుందని చెప్పకతప్పదు.