తెలంగాణలో బీజేపీ - కాంగ్రెస్ గెలిచే సీట్లు ఇవేనా?

Update: 2019-05-20 10:35 GMT
ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అంతా దేశ రాజకీయాలు - ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఎలాగూ టీఆర్ ఎస్ ప్రభంజనమే అని నిమ్మకుంటున్నారు. కానీ అన్ని సర్వే ఫలితాల్లో టీఆర్ ఎస్ కు 14 సీట్లు కన్ఫం అని.. ఓ రెండు ప్లస్ ఆర్ మైనస్ చూయించారు. ఇంతకీ ఆ రెండు స్థానాలేంటి.? అవి ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ పెరిగిపోయింది.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి చేవెళ్ల. కొండా విశ్వశ్వేర రెడ్డి పోటీచేస్తున్న ఈ స్థానం కైవసం చేసుకుంటామన్న ధీమాతో ఉంది. 890కోట్ల అధిపతి అయిన కొండా ఇక్కడ గెలుపు కోసం చేయాల్సిందంతా చేశాడట.. ఇక మల్కాజిగిరిలో గెలుపుపై రేవంత్ కూడా ధీమాగా ఉన్నాడు. ఇక్కడ సానుభూతి - రేవంత్ మేనియా పనిచేసిందంటున్నారు. ఈ రెండు పక్కాగా ఉన్నా మధ్యలో భువనగిరిపై కూడా కాంగ్రెస్ ఆశలు పెంచుకుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తృటిలో గెలిచినా గెలవొచ్చు అన్న అంచనాకు వచ్చింది.

ఇక బీజేపీ మాత్రం ఒకే ఒక్క స్థానంపై ఆశలు పెంచుకుంది. అది కరీంనగర్ పార్లమెంట్ పైనే.. ఓటింగ్ సరళి చూశాక చాలా మంది ఇక్కడ బీజేపీ తరుఫున పోటీచేసిన యువనాయకుడు  బండిసంజయ్ గెలవడం ఖాయమంటున్నారు. ఇక సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి టఫ్ ఫైట్ ఇస్తాడని అంటున్నారు.

మొత్తంగా కాంగ్రెస్ రెండు - బీజేపీ 1 సీటు అయినా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ ఎస్ మాత్రం 14 సీట్లు పక్కా అని భావిస్తోంది. 1 ఎంఐఎంకు పోగా.. మిగిలిన రెండు సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందా.? బీజేపీ ఒక్క సీటైనా గెలిచే అవకాశం ఉందా అన్న ఉత్కంఠ ఎగ్జిట్ పోల్స్ తర్వాత పెరిగిపోయింది.

   

Tags:    

Similar News