మహనీయుల మాటల్ని తూచా తప్పకుండా పాటించమే వారికి మనం ఇచ్చే ఘన నివాళి. కానీ.. భావోద్వేగాల నడుమ కొన్ని మాటల్ని తూచా తప్పకుండా అమలు చేయటం కష్టం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విషయంలోనూ తాజాగా అదే జరిగింది. గతంలో తన మరణం మీద ఆయన మాట్లాడుతూ.. తాను చనిపోతే ఆ రోజు సెలవు ఇవ్వొద్దని పేర్కొన్నారు. తాను మరణించిన రోజు సైతం మామూలుగానే పని చేయాలే తప్పించి.. సెలవు అక్కర్లేదన్నారు.
వారం రోజులు సంతాపదినోత్సవాల్ని ప్రకటించిన కేంద్ర సర్కారు సైతం.. సెలవు ప్రకటించలేదు. ఏపీ సర్కారు కూడా కలాంకు ఘన నివాళి ఇవ్వటంతో పాటు.. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారే తప్పించి.. సెలవు ఇవ్వలేదు. కానీ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు మాత్రం కలాం మృతికి సంతాపంగా సెలవును ప్రకటించాయి.
ప్రభుత్వ సంస్థలు.. పాఠశాలలు.. కాలేజీలకు సెలవు ప్రకటించారు. అయితే.. కొన్ని ప్రైవేటు సంస్థలు సైతం కలాం మృతికి సెలవు ప్రకటించాయి. నిజానికి వీరంతా కలాం మరణానికి నివాళిగానే సెలవు ప్రకటించారు. అయితే.. తన మరణానికి సెలవులు ఇవ్వకూడదన్న కలాం మాటను తూచా తప్పకుండా పాటిస్తూ.. కొన్ని ప్రైవేటు స్కూళ్లు.. మొదట సెలవు ప్రకటించి.. ఆ వెంటనే సెలవును రద్దు చేయటం గమనార్హం. మొత్తంగా తన మరణం సెలవు కాకూడదన్న కలాం మాట.. కొంత మేర మాత్రమే జరిగిందని చెప్పక తప్పదు.
అయితే.. దీని మీద ఒక ప్రముఖుడు స్పందిస్తూ.. కలాం సర్ మాటను మర్చిపోలేదు. కానీ.. ఆయన మరణించిన రోజును సెలవును బాధాతప్త హృదయంతో ఇచ్చిన నిర్ణయమే తప్పించి.. ఆయన మాటను పాటించకపోవటం కాదు. ఆవేదనతో నిండిన మనసును పని చేయమనటంలో అర్థం లేదు కదా అని చెప్పుకున్నారు. భావోద్వేగాలు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని మాటలు పాటించటం కష్టమే.