రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా లేదులేదనుకున్న తెలంగాణలో టీడీపీ ప్రభంజనం కనిపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటన సూపర్ సక్సెస్ అయింది. భారీ ఎత్తున ప్రజలు కూడా తరలి వచ్చారు. 2018 తర్వాత.. ఇక్కడ.. అంటే తెలంగాణలో చంద్రబాబు సభ పెట్టడం.. అది సూపర్ సక్సెస్ కావడం ఇదే తొలిసారి. దీంతో చంద్రబాబుకు ఏపీ కంటే తెలంగాణ సేఫా అననే చర్చ జరుగుతోంది.
ఖమ్మం సభకు నిజంగానే భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఎంతగా కాసాని జ్ఞానేశ్వర్‌పై అభిమానం ఉన్న ప్పటికీ.. ఈ సంఖ్యలో వచ్చేవారు అయితే కాదు. కానీ, తెలంగాణలో ప్రత్యామ్నాయ నాయకుడు.. నాయక త్వం అక్కడి వారికి కనిపించడం లేదు. కాంగ్రెస్‌ను తీసుకుంటే.. రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఉన్నప్పటికీ.. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ రోజుకో రకంగా రోడ్డున పడుతోంది. దీంతో ప్రజలు ఆ పార్టీని విశ్వసించడం లేదు.
ఇక, బీజేపీ మేం ముందున్నామని చెబుతున్నా.. అనుకున్న విధంగా తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చ డం లేదనే వాదన ఉండనే ఉంది. పైగా.. బీజేపీ అంటే మతతత్వ పార్టీ అనే ముద్ర పడిపోయింది.
పోనీ.. వ్యక్తులను బట్టి పార్టీ దూకుడు చూపిస్తోందని అనుకున్నా.. పట్టుమని పది మంది తప్ప బలమైన నాయకులు అక్కడ లేరు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్వహించిన సభకు.. భారీ ఎత్తున ప్రజలు తరలి రావడం వెనుక.. ఖచ్చితంగా ఆయనపై ఏదో నమ్మకం కనిపిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
హైదరాబాద్‌ను తనే అభివృద్ధి చేశానని ఆయన చెప్పుకొన్నా చెప్పుకోక పోయినా.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, ఉద్యోగాలు వంటివి ఆయన పేరును ఎప్పుడూ.. ప్రజల మధ్య చర్చకు పెడుతూనే ఉన్నాయి.
సో.. ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చేవే. అదేసమయంలో ప్రస్తుత సీఎం కేసీఆర్ కుటుంబంపై అవినీతి మరకలతోపాటు రెండు సార్లు అధికారం ఇచ్చినా.. రాష్ట్రం పెద్దగా తెచ్చుకున్న అభివృద్ధి లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాలతో చంద్రబాబుకు ఏపీ కంటే కూడా తెలంగాణ సేఫ్ జోన్ అవుతుందనేది మేధావుల మాట. మరి ఏం చేస్తారో.. చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.