మేకిన్ ఇండియా లక్ష్యంతో ముందుకు పోతున్న భారతావని ప్రయత్నానికి గండికొడతున్న లగ్జరీ కార్లపై మరింత పన్నును ముక్కుపిండి వసూలు చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఎంత సేపు భారత్ ని వినియోగదారుగా మాత్రమే చూడటం వల్ల మన సంపద తరలిపోవడమే గాని... మన మానవ వనరులకు ఉపాధి దక్కడం లేదు. దీంతో విదేశీ కార్లపై దిగుమతి సుంకం పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది.
ఆటో ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పీయూష్ గోయల్ మాటల్లో ఇది స్పస్టంగా కనిపించింది. భారత్‌లో తయారీని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పిన ఆయన దానికి తగినట్టు ఎగుమతులు పెంచుకోవాలన్నారు. అదే సమయంలో లగ్జరీ కార్ల దిగుమతి నియంత్రకు ప్రణాళిక చెప్పారు. దేశీయ వాహనాలు, విడిభాగాల ఉత్పత్తిని పెంచడానికి పారిశ్రామిక వేత్తల నుంచి ఆలోచనలను ఆహ్వానించారు. అంతేకాదు, కార్లు, వాహన విడిభాగాలపై దిగుమతి సుంకం పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దిగుమతి చేసుకుంటున్న లగ్జరీ కార్లపై భారీ పన్ను ఉంటుందని తెలిపారు.
మన దేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లపై దిగుమతి సుంకం పెంచితే... సంపన్నులు వాడే మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యు, ఆడి కార్లతో పాటు మధ్య తరగతి వర్గం కూడా వాడే స్కోడా, వోక్స్‌వాగన్, హోండా, టొయోటా కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే, దీని ఉద్దేశం చివరకు వారు ఇక్కడే ఉత్పత్తిని ప్రారంభించాలన్నదే కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఎలక్ట్రానిక్ ఆటో కాంపోనెంట్స్, స్టీల్ విడి భాగాల దిగుమతి విలువ ప్రస్తుతం 5 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం ఆటో విడిభాగాల దిగుమతుల విలువ 13.7 బిలియన్ డాలర్లుగా ఉంది. రానున్న నాలుగైదేళ్లలో వీటిని సగానికి తగ్గించుకోవాలన్నది కేంద్రం లక్ష్యం.