దేశంలో కరోనా తీవ్రత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గతంలో రోజుకు దేశ వ్యాప్తంగా పదివేల కేసులు నమోదు కావటమే వామ్మో అనుకునే స్థాయి నుంచి ఈ రోజున ఒక రాష్ట్రంలోనే రోజుకు పదివేల కేసులు నమోదు కావటం చూస్తున్నాం. అంతకంతకూ పెరుగుతున్న కేసుల తీవ్రత కారణంగా దేశంలో రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా రోజుకు యాభైవేల కొత్త కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ కీలక ప్రకటన చేసింది. కరోనా తీవ్రతను తగ్గించే ఔషధంగా చెబుతున్న ఫావిపిరవిర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ ట్యాబ్లెట్ ఒక్కొక్కటి రూ.35లకే విక్రయిస్తున్నట్లు చెప్పింది.
దేశంలో రోజురోజుకు కేసుల తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో.. వ్యాధి లక్షణాల్ని.. తీవ్రతను తగ్గించే అవకాశం ఉందని చెప్పే ఈ ఔషధం ధర ఎక్కువ కాకుండా.. అందుబాటు ధరలో ఉండేలా నిర్ణయించినట్లుగా సన్ ఫార్మా చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుబాటు ధరల్లోకి కీలక ఔషధం ఉండటం ప్రజలకు మేలు చేస్తుందని చెప్పక తప్పదు.