చంద్రుడి పై జెండా పాతిన డ్రాగన్

Update: 2020-12-06 05:28 GMT
అవును చంద్రడిపై డ్రాగన్ దేశం తన జెండాను సగర్వంగా పాతింది. అగ్రరాజ్యం అమెరికా తర్వాత జాబిల్లిపై జెండాను ఎగురవేసిన ఘనత చైనాకు దక్కింది.  కాకపోతే చంద్రుడిపై మానవరహిత యాత్రను జరిపిన దేశం మాత్రం మూడోదనే చెప్పాలి. మొదటిరెండు దేశాలుగా అమెరికా, రష్యాలు ఈ ఘనతను దక్కించుకున్నాయి. చంద్రుడిపై ప్రయోగాలను జరిపేందుకు మట్టి, శిలల నమూనాలను తెచ్చేందుకు చైనా ప్రయోగించిన చాంగే-5 వ్యోమనౌక ప్రయోగం నూరుశాతం విజయవంతం అయిందని డ్రాగన్ ప్రకటించింది.

 చాంగే-5లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, నిటర్నర్ అనే నాలుగు భాగాలున్నాయి. ఆర్బిటర్-రిటర్నర్ అనేవి చంద్రుడి కక్షలోనే ఉండిపోయాయి. అయితే డిసెంబర్ 1వ తేదీన  ల్యాండర్-అసెండర్ భాగాలు మాత్రం చంద్రుడిపై దిగాయి. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అక్కడి మట్టి, శిలల నమూనాలను సేకరించింది. ఈ నమూనాలను తీసుకుని అసెండర్ మాత్రం మొన్న శుక్రవారం నింగిలోకి దూసుకుని వచ్చేసింది. నమూనాలను తీసుకుని బయలుదేరే ముందు ల్యాండర్-అసెండర్ పై చైనా 90 సెంటీమీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పున్న జాతీయ జెండాను ఎగురవేశాయి.

ఇటువంటి ఘనతను అమెరికా 1969లోనే సాధించింది. తాజాగా సేకరించిన నమూనాలను తీసుకుని ప్రత్యేకంగా తయారు చేసిన క్యప్సూల్లోకి చేరవేస్తాయి. తిరుగుప్రయాణానికి అనువైన పరిస్ధితులు ఉన్నాయని అనుకున్నపుడు రిటర్నర్  భూమి మీదకు వచ్చేస్తుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఈ రిటర్నర్ దిగుతుందని అంచనా వేస్తున్నారు. 1976లో ఇదే పద్దతిలో రష్యా కూడా నమూనాలను తెప్పించింది జాబిల్లిపై నుండి.
Tags:    

Similar News