పెను సంచలనంగా మారిన బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి కారు డ్రైవర్ గా వ్యవహరించే రజనీకుమార్ ఆఘాయిత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
అతగాడు కామపిశాచి అన్న విషయమే కాదు.. చిన్నారితో పాటు అతడి బారిన పడిన బాధిత పిల్లలు పది నుంచి పదిహేను మంది వరకు ఉండొచ్చన్న విషయం తాజాగా వెలుగు చేసింది.
పోలీసుల దర్యాప్తులో పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యంతో పాటు.. కారు డ్రైవర్ ఆరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న డ్రైవర్ రజనీ కుమార్ రెండో పెళ్లి చేసుకున్నాడని.. వారికి ఇద్దరు పిల్లలుగా చెబుతున్నారు. వారు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నట్లుగా బయటకు వచ్చింది.
ప్రిన్సిపాల్ మాధవి వద్ద పదకొండేళ్లుగా కారు డ్రైవర్ గా పని చేస్తున్న ఇతడు.. పేరుకు డ్రైవర్ కానీ టీచర్లకు సలహాలు ఇవ్వటం.. ఫీజుల వసూళ్లు.. పిల్లలకు పనిష్మెంట్లు లాంటి వాటిని కూడా పెత్తనం చేసేవాడన్న విషయం బయటకు వచ్చింది.
ఇతడి అతి తీరుపై ఫిర్యాదులు వచ్చినా.. ప్రిన్సిపాల్ డ్రైవర్ కావటంతో సిబ్బంది కూడా మౌనంగా ఉండేవారని చెబుతున్నారు. స్కూల్ ఆవరణలో ఇతగాడి కోసం ప్రత్యేకంగా డిజిటల్ రూంను కేటాయించటం గమనార్హం. అందమైన చిన్నారుల్ని ఎంచుకొని ఆ గదిలోకి తీసుకెళ్లి వారిపై ఆఘాయిత్యానికి పాల్పడేవాడన్న షాకింగ్ నిజాన్ని పోలీసులు తమ దర్యాప్తులు గుర్తించారు.
ఈ స్కూల్లో మొత్తం 14 సీసీ కెమేరాలు ఉన్నా.. వాటిల్లో మూడు పని చేయటం లేదని.. అలా కెమేరాలకు చిక్కుండా తన దారుణాల్ని సాగించేవాడన్న విషయం పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చింది. గతంలో ఇతడిపై నల్గొండ జిల్లా పరిధిలో వరకట్న వేధింపుల కేసు నమోదైన విషయాన్ని గుర్తించారు. మరిన్ని వివరాలు దర్యాప్తులో బయటకు రావొచ్చన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.