ఏపీ ప్రధానప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ.. విశ్లే షణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. భోగి సందర్భంగా కృష్ణాజిల్లా పరిటాలలో సంబరాలు చేసుకున్న చంద్రబాబు.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా.. "మీ అందరికీ పూనకం వచ్చింది అప్పుడు. ఓట్లు వేశారో ఏం జరిగిందో నాకైతే తెలియదు. నేను ఏం తప్పు చేశానో నాకు తెలియటం లేదు. మిమ్మల్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని అనుకోవడమే నా తప్పైతే... క్షమించమని మిమ్మల్నందరినీ మరో సారి కోరుకుంటున్నా" అని చంద్రబాబు అనేశారు. నిజానికి ఇప్పుడు ఎన్నికలు పూర్తయి పోయి.. దాదాపు 20 నెలలు అయిపోయింది.
అందరూ కూడా ఆనాటి పరిస్థితి, ఎన్నికలు.. వంటి విషయాలను మరిచిపోయారు. కానీ, చంద్రబాబులో మాత్రం నాటి ఓటమి బాధ తాజా వ్యాఖ్యలతో మళ్లీ కొట్టొచ్చినట్టు కనిపించిందని అంటున్నారు పరిశీలకు లు. ఇప్పుడు చంద్రబాబు నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఆయన అభిమానులు కానీ, పార్టీ సానుభూతి పరులు కానీ ఎవరూ అనుకోలేదు. భవిష్యత్తుపై దూకుడుగా ముందుకు సాగుతారని అనుకు న్నారు. కానీ, అనూహ్యంగా చంద్రబాబు.. గత ఎన్నికల్లో ఓటమిని ప్రస్తావించి.. తప్పయితే.. క్షమించని అనడం.. ఆయన స్థాయికి, రాజకీయ అనుభవానికి కూడా సరైంది కాదని అంటున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమనే విషయాన్ని చంద్రబాబుకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు.
విజయం సాధించినప్పుడు.. పొంగిపోయి.. ఓడిపోయినప్పుడు కుంగిపోతే.. నష్టపోయేది ఖాయమనే విష యాన్ని తమ్ముళ్లకు చంద్రబాబే పలుమార్లు చెప్పేవారు. ఎందుకంటే..ఆయన గెలిచి తీరడం ఖాయమని భావించిన 2004లో ఓడిపోయారు.. అయినా.. నిర్వేదం రాలేదు. పార్టీకి కీలక నేతలు రాం రాం చెప్పారు. అయినా.. బాధపడలేదు. ఇక, 2009లో అయినా.. అధికారపీఠం దక్కించుకుంటానని భావించారు. కానీ, అప్పట్లోనూ రివర్స్ అయింది. వరుస ఓటములతో ఒకింత కుంగిపోయినా.. ఆ వెంటనే పుంజుకున్నారు. కానీ.. ఎక్కడా నన్నెందుకు ఓడించారు.. నేనేమైనా తప్పుచేశానా? క్షమించండి! అనే కామెంట్లు మాత్రం ఆయన నోటి నుంచి రాలేదు. దీనికి కారణం.. గెలుపు-ఓటములను సమానంగా చూడడమేకాదు.. తన సమవుజ్జీలతో పోటీ చేసి.. గెలుపు గుర్రం ఎక్కలేక పోవడమే!
కానీ, 2019 ఎన్నికల్లో ఓటమి మాత్రం డిఫరెంట్. అసలు రాజకీయాలు ఏంచేయగలడు, రాష్ట్రాన్ని ఏం పాలించగలడు.. అనుకున్న జగన్.. ఒక ప్రభంజనమై మెరిసి.. ఒక్క అధ్యాయం సృష్టించారు. 151 మంది ఎమ్మెల్యేలతో కనీవినీ ఎరుగని రీతిలో అధికార పీఠం ఎక్కాడు. ఇది నిజంగా ఒకవైపు రాజకీయంగానే కాదు.. మరోవైపు నైతికంగా కూడా చంద్రబాబుకు ఇబ్బందిని కలిగించింది. తన స్నేహితుడు(వైఎస్) కొడుకు చేతిలో పరాభవం పొందడం.. మరీ దారుణంగా ఓడిపోవడం వంటివి బాబుకు నిద్రపట్టనివ్వడం లేదనే విషయాన్ని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. లేకపోతే..ఎక్కడి ఎన్నికలు.. 20 నెలలు జరిగిపోయినా.. ఇంకా పలవరింతలు వస్తున్నాయంటే.. జగన్ షాట్.. ఏ రేంజ్‌లో తగిలిందో ..! అనే కామెంట్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.