ప్రజాస్వామ్యంలో మీడియా అత్యంత శక్తివంతమైనదని, దాన్ని న్యాయస్థానాలు నిరోధించలేవని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తేల్చి చెప్పినట్టు సమాచారం. మీడియాను రిపోర్టింగ్ చేయకుండా అడ్డుకోవడం సాధ్యం కాదని చెప్పినట్టు తెలుస్తోంది. మద్రాసు హైకోర్టు ఎన్నికల కమిషన్ పై పరుష వ్యాఖ్యలు చేయడంపై నొచ్చుకున్న ఈసీ.. సుప్రీంను ఆశ్రయించింది. ఈ అంశంపై విచారణలో భాగంగా అత్యున్నత ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
కరోనా ఉధృతంగా కొనసాగుతున్న వేళ ఎన్నికల నిర్వహించడాన్ని ఇటీవల తప్పుబట్టిన మద్రాసు హైకోర్టు.. ఈసీపై హత్యకేసు పెట్టాలని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారించిన సుప్రీం.. హైకోర్టు చేసిన కఠినమైన వ్యాఖ్యలు సానుకూల దృక్పథంతోనే తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టులను సంయమనం పాటించాలని తాము కోరలేమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
హైకోర్టులు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు అని స్పష్టం చేసిన సుప్రీం.. న్యాయస్థానాల వ్యాఖ్యలను సానుకూలంగా తీనే తీసుకోవాలని చెప్పింది. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ఎదురైన లోపాలను ఎత్తిచూపుతూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను '[చేదు మాత్రలు'గా తీసుకోవాలని సూచించింది సుప్రీం.
అదేవిధంగా.. మీడియాను అదుపు చేయాలని మద్రాస్ హైకోర్టును కోరగా.. తోసిపుచ్చిందన్న విషయాన్ని కూడా సుప్రీం దృష్టికి తెచ్చింది ఈసీ. దీనిపైనా స్పందించిన సుప్రీం.. మద్రాస్ హైకోర్టును సమర్థించింది. ప్రజాస్వామ్యంలో మీడియాను రిపోర్టింగ్ చేయొద్దని నిరోధించలేమని స్పష్టం చేసింది.