అలీ .. సినిమాల్లో కమెడియన్ గా అందరికి బాగా సుపరిచితుడే. ఈయన సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ అలాగే పలు షోస్ లో వ్యాఖ్యాత గా కూడా వ్యవహరిస్తుంటారు. అలాగే , అలీ రాజకీయాల్లో కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అలీ వైసీపీలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్ధతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ను అలీ ఆకాశానికెత్తేశారు. సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ పంచ్ డైలాగుతో సీఎంను కొనియాడారు. ఆ సింహం జగన్ మోహన్ రెడ్డేనని అన్నారు. ఒక సామాజిక వర్గం అని కాకుండా అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని భావిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని, సామాన్య మైనారిటీ మహిళ కరీమున్నీసాకు పిలిచి మరీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని అలీ వెల్లడించారు. విజయవాడ అభివృద్ధిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను నమ్మవద్దని, జగన్ తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. జగన్ అమలు చేస్తున్న పథకాలను చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు.
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ఏకైక నేత వైఎస్ జగన్ అన్నారు. జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని కోరారు. అప్పడు వైఎస్ పాలన చూశాం..ఇప్పుడు జగన్ పాలనను చూస్తున్నాం అని అనందం వ్యక్తం చేశారు.పశ్చిమ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన అనంతరం అలీ భవానీపురం దర్గాకు వెళ్లారు. గాలిబ్ షహీద్ దర్గాలో ఆయన పూలు, ఛాదర్ సమర్పించారు. అనంతరం కాసేపు అభ్యర్ధులతో ముచ్చటించాక వెనుదిరిగారు. గత అసెంబ్లీ ఎన్నకిలకు ముందే వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.