45 శాతం మద్యం ఈ ఐదు రాష్ట్రాల ప్రజలే తాగేస్తున్నారట !

Update: 2020-05-08 08:50 GMT
మద్యం ..దేశ ఆర్థిక వ్యవస్థని తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ విషయం తాజాగా మరోసారి రుజవైంది. కరోనా లాక్ డౌన్ కారణంగా మద్యం అమ్మకాలు జరగకపోవడం తో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని కోల్పోయి ..మందు షాప్స్ ఓపెన్ చేయాలనీ కేంద్రాన్ని కోరాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసిన కేంద్రం కూడా మరో మార్గం లేక మద్యం అమ్మకాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మందు షాప్స్ ఓపెన్ చేసిన రెండు రోజుల్లో వందల కోట్ల రూపాయల మద్యం అమ్ముడైంది.

అయితే, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫ‌ర్మేష‌న్ స‌ర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపిన స‌ర్వే ప్ర‌కారం దేశంలో ఉత్ప‌త్తి అయ్య మొత్తం మ‌ద్యంలో 45 శాతం మ‌ద్యాన్ని సౌత్ రాష్ట్రాల వారే తాగేస్తున్నారంట. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ - తెలంగాణ‌ - త‌మిళ‌నాడు - క‌ర్ణాట‌క‌ - కేర‌ళ రాష్ట్రాల ప్ర‌జ‌లు మ‌ద్యం గ‌రిష్టంగా వినియోగిస్తున్నార‌ని తెలిపింది. అత్య‌ధికంగా మ‌ద్యం వినియోగించే రాష్ట్రంగా త‌మిళ‌నాడు మొద‌టి స్థానంలో నిలిచింది. దేశంలో ఉత్ప‌త్తి అయ్యే మ‌ద్యంలో 13శాతం ఆ రాష్ట్రంలోనే  తాగేస్తున్నారు. క‌ర్ణాట‌క రాష్ట్రం 12శాతం  - తెలంగాణ రాష్ట్రం 6శాతం - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో 7 శాతం - కేర‌ళ రాష్ట్రం 5 శాతం  మద్యాన్ని తాగేస్తున్నారు.

ఉత్త‌రాది రాష్ట్రాలైన ఢిల్లీ - పంజాబ్‌ - ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ - ప‌శ్చిమ‌బెంగాల్‌ - మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ - రాజ‌స్థాన్ మొత్తం 12 రాష్ట్రాల్లో 75శాతం మ‌ద్యం వినియోగంలో ఉందని తేలింది. ఆదాయం విష‌యానికి వ‌స్తే కేవ‌లం 3.3 కోట్ల జ‌నాభా ఉన్న కేర‌ళ రాష్ట్రం త‌మ ఆదాయ వ‌న‌రుల్లో మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా 15 శాతం రెవెన్యూ సాధించి దేశంలోనే మొద‌టి స్థానంలో ఉంది.  ఎందుకంటే ఐదు రాష్ట్రాలతో, దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే కేర‌ళ ప్ర‌భుత్వం మ‌ద్యంపై అత్య‌ధిక ప‌న్ను వ‌సూలు చేస్తుంది.  రాష్ట్రాల వారిగా మ‌ద్యం రెవెన్యూ శాతం చూస్తే  క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ 11శాతం, తెలంగాణ 10శాతం క‌లిగి ఉన్నాయి. జాతీయ జ‌నాభాలో 4 శాత‌మే ఉన్న ఢిల్లీ రాష్ట్రం మ‌ద్యం ఆదాయం విష‌యంలో దేశంలో మూడో స్థానంలో ఉంది.
Tags:    

Similar News