యూపీలో మరో ఉన్నావ్ ఘటన..పెట్రోల్ తో దాడి , ఆసుపత్రిలో మృతి!

Update: 2020-11-18 15:30 GMT
యూపీ .. ప్రస్తుతం ఈ పేరు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని అత్యాచార ఘటనలు యూపీలోనే జరుగుతున్నాయి. మహిళలపై జరిగే అత్యాచారాల్లో యూపీ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. గతేడాది ఉన్నావ్ అత్యాచార కేసు , తరహాలోనే అత్యాచార బాధితురాలిపై నిందితులు పెట్రోల్ దాడి చేయగా , ఆ బాధితురాలు హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతూ తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన పై పూర్తి వివరాలను చూస్తే ...

బులంద్‌ షహర్‌ లో ఓ అత్యాచార బాధితురాలిపై నిందితుడి బంధువు ఒకరు దాడి చేశారు. ఆమెకు నిప్పంటించి సజీవదహనం చేసేందుకు యత్నించాడు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితురాలు... చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అత్యాచార కేసులో రాజీ కుదుర్చుకోవాలని గత కొన్ని రోజులుగా నిందితుడి కుటుంబ సభ్యులు,స్నేహితులు తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితురాలి కుటుంబం వెల్లడించింది. దానికి ఒప్పుకోకపోవడంతో నిందితుడి తండ్రి తమ కుమార్తెపై దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా ఏడుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అలాగే ఈ కేసులో భాగంగా ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికే జైల్లో ఉన్నాడని సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఈ కేసు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులపై వేటు కూడా వేసినట్లు తెలిపారు. అంతకుముందు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి భిన్నమైన వాదన వినిపించారు. ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో బాధితురాలే తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఈ ఏడాది అగస్టు 15న అత్యాచార ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని ప్రకారం.. తమ గ్రామంలోని మామిడి తోటకు కాపలాగా ఉండే ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు చేసిన రోజే పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

అప్పటినుంచి కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా నిందితుడి మామ బాధితురాలిని,ఆమె కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. మరోవైపు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధితురాలిని మరింత ఆవేదనకు గురిచేసింది. ఇదే క్రమంలో నిందితుడి మామ ఆమెపై దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. గతేడాది యూపీలోని ఉన్నావ్ అత్యాచార కేసులోనూ బాధితురాలిపై పెట్రోల్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. కోర్టు విచారణకు వెళ్తున్న సమయంలో బాధితురాలిని నిందితులు చుట్టుముట్టి, నిప్పు అంటించారు. దీంతో 90శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి చెందింది.
Tags:    

Similar News