ప్రపంచంలోనే అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యా అధ్యక్షుడినే లేపేద్దామని అనుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా వలయం ఉన్న పుతిన్ ను చేరుకోవడమే చాలా కష్టం. దానిని దాటుకొని ఆయనపై హత్యాయత్నం చేయడం అసాధ్యం. కానీ ఇది జరిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
రెండు నెలల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఓ దాడి నుంచి తప్పించుకున్నట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ విబాగం అధిపతి కైర్ యలో బుద్ నోవ్ ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చాడు.
నల్లసముద్రం, కాస్పియన్ సముద్రం మధ్య ఉన్న ప్రాంతాలను 'కాకసస్' అని పిలుస్తారు. ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలైన తొలి నాళ్లలో పుతిన్ ఇక్కడ పర్యటించారని.. కాకసస్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడిపై అక్కడి ప్రతినిధులు దాడి చేసినట్లు బుద్ నోవ్ తెలిపారు.ఈ దాడి నుంచి పుతిన్ సురక్షితంగా తప్పించుకున్నారని వివరించారు. ఈ విషయాన్ని రష్యాలో వీలైనంత రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించారన్నారు.
పుతిన్ కు ఆగస్టు నుంచి వ్యతిరేక పవనాలు వీయవచ్చని.. ఈ ఏడాది చివరి నాటికి క్రెమ్లిన్ లో తిరుగుబాటు జరిగి ఆయన్ను పదవి నుంచి తప్పించవచ్చని అంచనావేశారు. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైపోయిందన్నారు. పుతిన్ తన కడుపులో చేరిన ద్రవాలను తొలగించుకునేందుకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వార్తలు వస్తున్న సమయంలో ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధిపతి ఈ విషయాన్నివెల్లడించారు.
70 ఏళ్ల పుతిన్.. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం.. ఇప్పటికే పుతిన్ లో పార్కిన్సన్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయని.. పుతిన్ ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోందని.. సన్నిహితులు, అతిథులతో కూడా చాలా దూరం పాటిస్తున్నారని కథనాలు వచ్చాయి.
పుతిన్ స్టెరాయిడ్లను తీసుకుంటారని.. ఇది ఆయన దూకుడును పెంచుతుందని ఆరోపించారు. ఆయనకు అనారోగ్య కారణంగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారేమో తెలియదు కానీ.. పుతిన్ రోగనిరోధక శక్తి నశించిపోయిందన్నారు.గతంలో కూడా పుతిన్ ఆరోగ్యంపై చాలా వార్తలు, ఊహాగానాలు ప్రసారం అయ్యాయి. మీడియా కథనాలపై పుతిన్ సర్కార్ స్పందించలేదు.