లోక్ సభ లో తన రెండో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. లోక్ సభ గ్యాలరీ నుంచి తన కూతురు పరకాల వాంగ్మయి వీక్షిస్తుండగా బడ్జెట్ ప్రతిని నిర్మల చదవడం ప్రారంభించారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుందని భావిస్తున్నానని, ఆయా రంగాలకు తగ్గట్లుగా ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్రం రూపొందించిందని నిర్మల సభకు తెలిపారు. ప్రజల ఆదాయాలను మెరుగుపరచడమే బడ్జెట్ లక్ష్యమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. ప్రజల్లో కొనుగోలు శక్తిని ముమ్మరం చేస్తామని ఈ సందర్భంగా నిర్మల పునరుద్ఘాటించారు.
బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భం గా నిర్మలా సీతారామన్ భారత దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ఓ కవితను వినిపించారు. ``నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది...మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం...నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం....మా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిది...``అంటూ నిర్మల భావోద్వేగంతో దేశపు గొప్పదనాన్ని చాటిచెప్పారు. అనంతరం, దివంగత నేత అరుణ్ జైట్లీని నిర్మలా సీతారామన్ గుర్తు చేసుకున్నారు. జీఎస్టీ ఓ చరిత్రాత్మక ఆర్థిక సంస్కరణ అని, జీఎస్టీ అమలు తర్వాత సామాన్యుల ఖర్చులు 4శాతం వరకు ఆదా అయ్యాయని అన్నారు. జీఎస్టీ శ్లాబుల తగ్గింపు తో సామాన్యులకు మేలు జరిగిందని, జీఎస్టీ తో కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు పెరిగారని చెప్పారు.
అయితే, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదని నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి లో 15పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతున్నాయని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. భారత్‌లో ఆర్థిక వనరులు పుష్కలం గా ఉన్నాయని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతామని చెప్పారు. ఎకానమీని సంఘటిత పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆరోగ్యకరమైన వాణిజ్య వృద్ధి కి తోడ్పాటునందిస్తామని అన్నారు. ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపట్టిందని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భం గా నిర్మలా సీతారామన్ భారత దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ఓ కవితను వినిపించారు. ``నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది...మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం...నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం....మా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిది...``అంటూ నిర్మల భావోద్వేగంతో దేశపు గొప్పదనాన్ని చాటిచెప్పారు. అనంతరం, దివంగత నేత అరుణ్ జైట్లీని నిర్మలా సీతారామన్ గుర్తు చేసుకున్నారు. జీఎస్టీ ఓ చరిత్రాత్మక ఆర్థిక సంస్కరణ అని, జీఎస్టీ అమలు తర్వాత సామాన్యుల ఖర్చులు 4శాతం వరకు ఆదా అయ్యాయని అన్నారు. జీఎస్టీ శ్లాబుల తగ్గింపు తో సామాన్యులకు మేలు జరిగిందని, జీఎస్టీ తో కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు పెరిగారని చెప్పారు.
దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయని, ఈ బడ్జెట్ దేశ ప్రజల ఆర్థిక స్థోమతను పెంచుతుందని నిర్మల చెప్పారు.