ప్ర‌జాద‌ర్బార్‌.. పెట్టడం వెనుక జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇదే..!

Update: 2022-07-17 03:30 GMT
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్‌.. మ‌రోవ్యూహానికి తెర‌దీశారు. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు.. స్వ‌యంగా ఆయ‌నే రంగంలోకి దిగారు. ఇప్ప‌టి వ‌రకు.. రాష్ట్రంలో వైసీపీ నాయ‌కుల‌ను, ఎంపీల‌ను,ఎమ్మెల్యేల‌ను, మంత్రుల‌ను ఆయ‌న ప్ర‌జ‌ల వద్ద‌కు పంపించారు. అయితే.. ఎక్క‌డా కూడా ఆశించిన మేర‌కు సానుకూల‌త క‌నిపించ‌లేదు. పైగా స‌మ‌స్య‌ల చిక్కుముడులు భ‌య‌పెడుతున్నాయి. దీంతో అస‌లు క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతోంద‌నే విష‌యంపై సీఎం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో వాస్త‌వాలు ఏంటో.. స్వ‌యంగా తానే తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్ర‌జ‌ల ను త‌న వ‌ద్ద‌కే పిలుచుకుని.. వారి గోడు విన‌డం ద్వారా.. వారికి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని ఆయ‌న ఆలోచ న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి ఇప్ప‌టికే రెండుర‌కాలుగా ఈ ప్ర‌య‌త్నం చేశారు.

ఒక‌టి  త‌న తండ్రి దివంగ‌త సీఎం వైఎస్ ప్రారంభించేందుకు బ‌య‌లుదేరి.. మృతి చెందిన ర‌చ్చ‌బండ‌ను తాను ప్రారంభించాల‌ని అనుకున్నారు. కానీ, ఎందుకో .. ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించ‌వ‌ద్ద‌ని విశాఖ స్వామి స‌ల‌హా ఇచ్చారు.

దీంతో ఆయ‌న ఈ కార్య‌క్ర‌మాన్నివాయిదా వేశారు. రెండోది జిల్లాల ప‌ర్య‌ట‌న‌. దీనిపైనా కొన్నాళ్లుగా ప్ర‌చా రం జ‌రిగింది. సీఎం జ‌గ‌న్ జిల్లాల‌కు వ‌స్తున్నార‌ని.. నాయ‌కులు కూడా చెప్పారు. సీఎం కూడా స్వ‌యంగా తాను జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను త్వ‌ర‌లోనే చేప‌ట్టనున్న‌ట్టు ఎమ్మెల్యేలు, ఎంపీలకే చెప్పారు.

కానీ.. ఇప్పుడు ఈ విష‌యాన్ని కూడా ప‌క్క‌న పెట్టారు. అభివృద్ధి లేకుండా.. జిల్లాల‌కు వెళ్ల‌డం ఎందుకులే అని అనుకున్నా రో.. ఏమో.. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఇచ్చేలా .. వ్యూహం రెడీ చేసుకున్నారు.

అంటే.. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం సంక్షేమాన్ని న‌మ్ముకుంది. ఇది వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నం ఇస్తుంది. అదే విధంగా.. ప్ర‌భుత్వం కూడా దీనిని ప్రాధాన్యం గా తీసుకుంది. ఈ నేప‌థ్యంలో వ్య‌క్తిగ‌త ఇబ్బందుల‌కు ప్రాధాన్యం ఇస్తూ.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని.. జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ప్ర‌జాద‌ర్భార్‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు వైసీపీ వ‌ర్గాలు క్లూ ఇచ్చాయి. వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మాన్ని కూడా 2021 జూలై 8నే ప్రారంభించాల్సి ఉంది. దీనికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ, చివ‌రి నిముషంలో వాయిదావేశారు. మ‌రి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News