విశాఖ ఉద్య‌మానికి ఏడాది పూర్తి: నారా లోకేష్ పిలుపు ఇదే!

Update: 2022-02-12 09:45 GMT
ఆంధ్రుల హ‌క్కుగా పేర్కొనే విశాఖ ఉక్కును కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేటీక‌రించ‌డానికి చేసే ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకునేందుకు ఇక్క‌డి కార్మికులు ఉద్య‌మ బాట ప‌ట్టి.. నేటికి స‌రిగ్గా ఏడాది పూర్తయింది. ఉద్యోగులు, కార్మికులు.. స్థానికులు రాజ‌కీయ పార్టీలు ఇలా.. అన్ని వ‌ర్గాల వారు కేంద్ర ప్ర‌భుత్వ న‌నిర్ణ‌యాన్ని తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నారు.

 ఈ క్ర‌మంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర‌స‌న‌లు, నిరాహార దీక్ష‌లు కూడా చేప‌ట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి మూడు లేఖ‌లు రాశామ‌ని.. కేంద్రం స్పందించ‌డం లేద‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ.. ఇక్కడి ప్ర‌జ‌లు, కార్మికులు ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తున్నారు. ఈ ఉద్య‌మానికి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా  విశాఖ ఉక్కు కార్మికులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఉద్యమాభివందనాలు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ వ్యతిరేకిస్తోందన్నారు.

అసెంబ్లీ నుంచి పార్లమెంటు వరకు టీడీపీ ఏడాది పొడవునా... నిరసన గళం వినిపిస్తూనే ఉందని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజల సంకల్పానికి నిదర్శనమని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని తెలిపారు.

ప్రజలు ఐక్యంగా ఉండి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఉక్కు ప్రైవేటీకరణపై సీఎం జగన్, వైసీపీ ఎంపీలు మాట్లాడకపోవడం బాధాకరమని లోకేష్ విమ‌ర్శించారు.  

అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా విశాఖ ఉక్కును కాపాడుకుంటామని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తైన సందర్భంగా... కూర్మన్న పాలెంలోని శిబిరం వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త మద్దతు కూడగట్టామన్న కార్మిక సంఘాల నేతలు.. కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో.. ఈ నెల 13 న జైల్‌భరో నిర్వహిస్తామని తెలిపారు.

విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజల సంకల్పానికి నిదర్శనమని స్థానికులు పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని తెలిపారు. ప్రజలు ఐక్యంగా ఉండి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పేర్కొన్నారు. కేంద్రానికి తెలుగు వారి స‌త్తాను రుచి చూపించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ రెడీ కావాల‌ని.. ఈ సంద‌ర్భంగా.. నారా లోకేష్ పిలుపునిచ్చారు.


Tags:    

Similar News