రాజకీయాల్లో ఎపుడూ బలంగానే ఉండాలి. కనీసం అలాగైనా కనిపించాలి. దానికోసమే నేతలు అన్నీ మూసి చూపించాల్సింది మాత్రమే బయటకు చూపిస్తారు. ఓడినా రేపు మాదే విజయం అంటారు. అయితే ఏపీ రాజకీయాలో టీడీపీ వైసీపీల మధ్య సాగుతున్న సమరంలో వీక్ పాయింట్స్ పై చేయి సాధిస్తున్నాయి. అవే ఇటూ ఇటూ మోహరించి సై అంటే సై అన్నట్లుగా ఢీ కొడుతున్నాయి. ఏపీలో టీడీపీ పని అయిపోయింది అన్నది వైసీపీ వాదన. వాదన మాత్రమే కాదు, గత రెండున్నరేళ్లుగా జరిగిన అనేక ఎన్నికల్లో ఆ పార్టీ రుజువు చేసిన నిజమని కూడా అంటారు. పంచాయతీ నుంచి పరిషత్తు ఎన్నికల వరకూ అన్నీ కూడా వైసీపీ స్వీప్ చేసింది. గతంలో ఎపుడూ ఇలా జరగని విషయం ఇది. ఇక 151 సీట్లతో ఒక పార్టీ అధికారంలోకి రావడం అన్నది కూడా కొత్త చరిత్రే. ఈ నేపధ్యంలో వైసీపీ నిండా ధీమాతో ఉంటోంది.
ఇక టీడీపీ కూడా ఎప్పటికపుడు తన బలాన్ని పెంచుకోకుండా చూపించాల్సిన చోట చూపకుండా వైసీపీకి దొరికిపోతోంది. పరిషత్తు ఎన్నికలను బహిష్కరించడం టీడీపీ చేసిన అతి పెద్ద తప్పు అనుకుంటే బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల నుంచి తప్పుకోవడం మరో తప్పు. ఒక వైపు టీ ఏపీలో వైసీపీ పని అయిపోయింది అంటూనే ఇంకో వైపు ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయకపోవడం టీడీపీ వీక్ పాయింటే మరి. సరిగ్గా దాన్నే పట్టుకుని వైసీపీ ఆటాడించేస్తోంది.
ఎవరెన్ని కబుర్లు చెప్పినా బ్యాలెట్ పోరులో గెలిచిన వారే బహు మొనగాడు. ఆ విధంగా చూసుకుంటే బ్యాలెట్ సమరానికి ఈ మధ్య కాలంలో టీడీపీ ఎందుకో వెనక్కిపోతోంది. సవ్యంగా ఎన్నికలు జరగలేదు అన్న సాకుతోనో అధికారంలో ఉన్న వారే ఉప ఎన్నికల్లో గెలుస్తారు అన్న ఆలోచనతోనో ఏదో సాకు చెప్పి ఎన్నికల యుద్ధానికి స్వస్తి చెప్పేసింది. అదే టీడీపీ 2024 ఎన్నికల్లో గెలుస్తామని జబ్బలు చరిస్తే వైసీపీ మాట, జనం మాట ఎలా ఉన్నా కనీసం సొంత పార్టీ వారు అయినా నమ్మాలి కదా. ఇలా వ్యూహాత్మకమైన తప్పిదాలు చేస్తూ వైసీపీకి అస్త్రాలను టీడీపీ సమకూరుస్తోంది అన్న మాట అయితే ఉంది.
నిజానికి బద్వేల్ ఉప ఎన్నికల బరిలో టీడీపీ నిలబడి ఉంటే ఆ కధే వేరుగా ఉండేది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లోనే యాభై వేల ఓట్లు తెచ్చుకున్న టీడీపీ ఇపుడు దానికి మీద ఏ కాస్తా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నా ఏపీలో వైసీపీ పని అయిపోయింది అన్న చెప్పడానికి దమ్ము ఉండేది. దానిని జనాలు నమ్మడానికి ఆస్కారం ఉండేది. అలాంటి పొరాటాలు ప్రజాక్షేత్రంలో చేయాల్సిన ఉద్యమాలు మరచి కేవలం మీడియాను నమ్ముకుని ప్రత్యర్ధుల క్యారక్టర్ అసాసినేషన్ కి తెగబడితే టీడీపీకి కలసివచ్చేది ఏముంది, వైసీపీయే కాదు, అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా విపక్షాన్ని చాలా గట్టిగా అణచాలనే చూస్తుంది. దానికి జవాబు చెప్పాలి అంటే ప్రజల మధ్యనే నిలిచి తమకూ బలముందని చాటుకోవడమే. కనీసం ఎన్నికల్లో అయినా ఎంతో కొంత ఓట్ల శాతాన్ని పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ ఉంటే టీడీపీకి ఈ దుస్థితి ఉండేది కాదు. మొత్తానికి టీడీపీ వీక్ పాయింట్ బయటపడిపోతోంది. అదే వైసీపీకి చెలగాటగా మారుతోంది అన్నదే విశ్లేషణ.