కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేనిపోని సమస్య నెత్తి మీదకు వచ్చి పడుతుందా? అన్న సందేహం కలిగే ఉదంతమిది. నెత్తి మీదకు నలభై ఏళ్లా దాటినా పెళ్లి ఊసు ఎత్తని ఆయన్ను కొంతకాలం క్రితం వరకూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా అభివర్ణించేవారు.ఇప్పుడా ట్యాగ్ లైన్ తో ఎవరూ రాహుల్ ను అనటం లేదు. పెళ్లి కాని రాహుల్ ను.. మీ పెళ్లి ఎప్పుడన్నా.. చొట్టబుగ్గలతో ఓ నవ్వు నవ్వటమే తప్పించి సూటిగా సమాధానం ఇచ్చింది లేదు.
పెళ్లి ప్రశ్న అడిగి.. అడిగి విసుగొచ్చిన మీడియా సైతం.. ఇప్పుడాయన పెళ్లి ముచ్చటను అస్సలు పట్టించుకోవటం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానని ఒక దళిత మహిళ బయటకువచ్చింది. కాంగ్రెస్ సేవా దళ్ సభ్యురాలైన ఆమె..తాను రాహుల్ ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్న విషయానికి ఆమె చెబుతున్న మాట ఇప్పుడు అందరి దృష్టి పడుతోంది. ఈ మధ్యనే అలహాబాద్ లో జరిగిన ఇందిరా గాంధీ జయంతి ఉత్సవాలకు హాజరైన ఆమె.. తాను రాహుల్ ను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లుగా వెల్లడించింది.
ఎందుకిలా అంటే.. మొదట్లో రాహుల్ అంటే తనకు ఎలాంటి ఆసక్తి లేదని.. కానీ.. రెండు సార్లు రాహుల్ తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. తన బాగోగులు అడిగినప్పటి నుంచి తన మనసు రాహుల్ వైపు మళ్లినట్లుగా ఆమె చెప్పింది. గతంలో పెళ్లి అయిన ఆమె 2006లోభర్తకు విడాకులు ఇచ్చేసి విడిగా ఉంటోంది. దళిత మహిళ అయిన తనకు రాహుల్ ను పెళ్లి చేసుకోవాలని ఉందని.. ఈ మధ్యన కలలో రాహుల్ వస్తున్నట్లుగా ఆమె చెబుతోంది. రాహుల్ నే ఎందుకు పెళ్లి చేసుకోవాలనిపిస్తోందని అడిగిన జర్నలిస్టుకు.. ఆయనో మంచి రాజకీయనాయకుడంటూ కితాబు ఇచ్చింది. మరీ.. మహిళ ప్రేమకథపై యువరాజుల వారు ఎలా రియాక్ట్ అవుతారో..?
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/