వెంటిలేటర్ల తయారీలో భారత్ నుండి 3 కంపెనీలు ...ఆ 3 హైదరాబాద్ సంస్థలే !

Update: 2020-06-12 07:15 GMT
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ వైరస్ కోరల్లో చిక్కి వణికిపోతోంది. ఈ వైరస్ రోజురోజుకి మరింత వేగంగా వ్యాప్తి చెందుతూ విలయతాండవం చేస్తుంది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపుగా ఆరు నెలల సమయం గడిచినా కూడా ఇంకా ఇప్పటివరకు దీనికి సరైన వ్యాక్సిన్ రాలేదు. వ్యాక్సిన్ తయారీలో అనేక దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇకపోతే ఈ వైరస్ రోగుల చికిత్సకు ఉపయోగించడానికి నాసా సొంతంగా ఓ వెంటిలేటర్ ను  అభివృద్ధి చేసింది.

నాసా అభువృద్ది చేసిన వెంటిలేటర్లను తయారు చేయడానికి మూడు భారత కంపెనీలకు లైసెన్సులు లభించాయి.  భారత్‌ కు చెందిన ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌, మేధా సర్వో డ్రైవ్స్‌లు ఆ జాబితాలో ఉన్నాయని ద నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత కంపెనీలే కాకుండా మరో 18 ఇతర సంస్థలకు అనుమతులు దక్కాయి. అందులో 8 అమెరికా, 3 బ్రెజిల్‌కు చెందిన కంపెనీలున్నాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని తన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ (జేఎల్‌పీ) లో నాసా ఈ వెంటిలేటర్లను అభివృద్ధి చేసింది.

వెంటిలేటర్ల తయారీకి భారత్ నుండి నాసా ఎంపిక చేసిన మూడు సంస్థలు హైదరాబాద్ కు చెందినవే కావడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక ప్రయోజనాలు, వృద్ధిలో పరస్పర సహకారం అవసరమని ట్విట్ చేశారు హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ ఈ  ఎంపిక పట్ల అభినందనలు తెలిపింది.


Tags:    

Similar News