తిరుపతి పార్లమెంట్ ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 17న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఇప్పటికే అధికార వైసీపీ, టీడీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
తాజాగా ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కేంద్రం ఎన్నికల సంఘం పెంచింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్, ఎన్నికల అధికారి చక్రధర్ బాబు ఆదేశించారు.
రిటర్నింగ్ అధికారులతో సమీక్షించిన ఎన్నికల అధికారి తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉప ఎన్నిక సజావుగా.. నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈసీ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సప్లిమెంటరీ ఓటర్ల జాబితా తయారీలో పొరపాట్లకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత సహాయ రిటర్నింగ్ అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
1000కిపైగా ఓట్లు ఉన్న పోలింగ్ కేంద్రం పరిధిలో అదనంగా మరొకటి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి పంపి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.