తిరుపతి పోరు: సైలెంట్ గా దూసుకెళ్తున్న వైసీపీ అభ్యర్థి

Update: 2021-03-26 08:10 GMT
తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ చాపకింద నీరులా దూసుకెళుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వేళ అధికార వైసీపీ సైలెంట్ గా దూసుకెళ్తోంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పటికే టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నామినేషన్ వేశారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఈనెల 29న నామినేషన్ వేయనున్నారు. బీజేపీ కూడా మాజీ ఐఏఎస్ రత్నప్రభను అభ్యర్థిగా ప్రకటించింది. గెలుపు కోసం పార్టీలన్నీ వ్యూహాత్మకంగా కదులుతున్నాయి.

వైసీపీ తరుఫున కొత్త అభ్యర్థి అయినా డాక్టర్ గురుమూర్తి సైలెంట్ గా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎలాంటి హడావుడి చేయకుండానే ఆయా నియోజకవర్గ నేతలతో కలిసి ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు. గ్రామాలు , పట్టణాలు తిరుగుతూ వైసీపీ నేతలను ఏకం చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. పార్టీలన్నీ ఇంకా అభ్యర్థులతో నామినేషన్ వేయకముందే ప్రజల్లోకి రాకముందే గురుమూర్తి ఒక రౌండ్ చుట్టి వస్తున్నారు.

సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి రాబోయే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని.. అందరూ కలిసి పనిచేద్దామని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కోరుతున్నారు. గురుమూర్తి గెలుపు బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు.

ఇక గురుమూర్తి ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. తాను సైనికుడిలా పనిచేస్తానని.. నాయకులంతా తనకు ఆశీర్వాదం అందించాలని నేతలను కలుపుకునే పనిలో పడ్డారు.
Tags:    

Similar News