తృటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న టూవీలర్ ను ఢీ కొనటంతో పాటు.. డివైడర్ పైకి ఎక్కింది. ఈ ఘటనలో టూ వీలర్ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్లో బెలూన్లు ఓపెన్ కావటంతో కోదండం మాష్టారికి ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు.
ఈ ప్రమాదం వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన కోదండరాం హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. నేషనల్ హైవే మీద ప్రయాణిస్తున్న మాష్టారి కారు వెలిమినేడు సమీపంలోని పిట్టంపల్లి కూడలి దాటుతుండగా ఒక టూవీలర్ ఎదురుగా వచ్చింది.
దీంతో.. ద్విచక్రవాహనాన్ని కోదండరాం ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. టూ వీలర్ ను తప్పించే యత్నంలో వాహనం అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. ఈ ఘటనలో టూ వీలర్ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు (మహేశ్.. మధు) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కారులోని బెలూన్లు ఓపెన్ కావటంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.
అయితే.. కారులోని ముందు భాగం బాగా దెబ్బ తింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో కోదండం మాష్టార్ని వేరే వాహనంలో హైదరాబాద్ కు పంపేశారు. గాయపడిన ఇద్దరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కేసును నమోదు చేసిన పోలీసులు.. ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.