కుబేరుల జాబితా: తెలుగు శ్రీమంతులు వీరే..

Update: 2020-02-27 05:00 GMT
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అపర కుబేరుల జాబితాను ‘హురున్ రిచ్’ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ నిలిచారు.  ఇక భారత్ లోని నంబర్ 1 కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే 9వ స్థానంలో నిలిచారు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే  బిలియనీర్లలో భారత దేశం మూడో స్థానంలో నిలిచిందని హురున్ గ్లోబల్ రిచ్ 2020 జాబితా వెల్లడించింది. వీరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత  చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ భారత్ లో అగ్రస్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ సంపద విలువ ఏకంగా 6700 కోట్ల డాలర్లుకు చేరడం విశేషం. ఈయన గంటకు సంపాదించే మొత్తం ఎంత తెలుసా? ఏకంగా 7 కోట్లు. గంటకు 7కోట్లు సంపాదించే కుబేరుడు ముఖేష్ అంబానీ అని తెలిసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.

అయితే ఈ అపర కుబేరుల జాబితా లో తెలుగు వ్యక్తులు చోటు సంపాదించడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఈ బిలియనీర్ల జాబితా లో నిలిచారు. వీరిలో దివీస్ ల్యాబ్స్ అధినేతలు అయిన మురళీ దివి కుటుంబం ప్రపంచం లోనే 589వ స్థానంలో నిలిచింది. తెలుగువారిలో వీరే అగ్రగణ్యులు.. వీరి సంపాదన విలువ 430 కోట్ల డాలర్లు.

ఇక వీరి తర్వాత ప్రముఖ ఇన్ఫాస్ట్రక్చర్ సంస్థ ఎంఈఐఎల్ (మెయిల్) ప్రపంచంలోనే 1530 స్థానంలో నిలిచింది. వీరి సంపద విలువ 190 కోట్ల డాలర్లు. ఇదే మెయిల్ సంస్థకు చెందిన పీవీ కృష్ణారెడ్డి 180 కోట్ల డాలర్ల సంపాదనతో ప్రపంచంలో 1627వ స్థానంలో నిలిచి కుబేరుడిగా నిలిచాడు.

వీరి తర్వాత వరుసగా పీవీ రాంప్రసాద్ రెడ్డి (అరవిందో ఫార్మా), జూపల్లి రామేశ్వరరావు (మైహోమ్), కే సతీష్ రెడ్డి (డాక్టర్ రెడ్డీస్), జీవీ ప్రసాద్ (డాక్టర్ రెడ్డిస్)లు అపర కుబేరుల జాబితా లో చోటు సంపాదించారు.
Tags:    

Similar News