300 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వారి జీవితాలతో చెలగాడం ఆడిన కడప కేటుగాడు ప్రసన్నకుమార్ విషయంలో తవ్వేకొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడపకు చెందిన ప్రసన్నకుమార్ బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. చదవులో సున్నా అయినా మనోడి మైండ్ మాత్రం మహా ముదురుదే. అయితే దీనిని మంచి పనుల కోసం కాకుండా చెడు పనుల కోసం వాడడం మొదలు పెట్టాడు. టెక్నాలజీని వాడుకుని ఎంతో మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని సర్వం దోచుకున్నాడు. ప్రసన్నకుమార్ గురించి విచారణలో తవ్వేకొద్ది షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.
ప్రసన్న తాను నాశనం అయిపోవడంతో పాటు ఎంతోమందిని నిలువునా ముంచేశాడు. మనోడి దెబ్బకు ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 300 మంది యువతులు ట్రాప్‌లో పడ్డారంటే ఏ స్థాయిలో స్కెచ్‌లు వేసి వీళ్లను ట్రాప్ చేశాడో అర్థమవుతోంది. చివరకు నగ్నంగా కాల్స్ చేసి మోసపోయిన యువతులు తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి ఏమని చెప్పుకుంటారు ? చాలా మంది వీడి గురించి ఫిర్యాదు చేసేందుకు కూడా భయపడ్డారు. అయితే ఓ వ్యక్తి ధైర్యం చేసిన ఇచ్చిన ఫిర్యాదుతో మనోడి బాగోతం బట్టబయలు అయ్యింది.
ప్రసన్న ట్రాప్ చేసిన అమ్మాయిల్లో కాలేజ్ యువతులు, వివాహితులు, చివరకు మధ్య వయస్సు ఉన్న ఆంటీలు కూడా ఉన్నారట. కేవలం సోషల్ మీడియా అక్కౌంట్లను వాడుకున్న ప్రసన్న తన ఫొటోలను చాలా అందంగా మార్ఫింగ్ చేసి వాటిల్లో పెట్టేవాడు. అయితే ఎవ్వరికి అనుమానం రాకుండా వేర్వేరు పేర్లతో వీటిని ఓపెన్ చేసి అందమైన యువతులు, అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టి వారితో ముందుగా చాట్ చేస్తూ పరిచయం పెంచుకుని.. తర్వాత స్నేహితుడిగా మారేవాడు.
ఆ తర్వాత ఆడియో కాల్స్.. చివరకు అతడి ట్రాప్‌లో పడ్డ కొందరు న్యూడ్ కాల్స్ కూడా చేసేవారు. ఆ తర్వాత వాళ్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజేవాడు. లేకపోతే వాళ్లతో చేసిన చాటింగ్‌లు, న్యూడ్ కాల్స్ సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. అయితే ఓ వ్యక్తికి జాబ్ ఇప్పిస్తానని మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు. సదరు వ్యక్తి కి జాబ్ ఇప్పించలేదు. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రసన్నకుమార్ పాత చిట్టా అంతా బట్టబయలు అయ్యింది. ఇక ఎవరైనా తాము జర్నీలో ఉన్నామని.. ట్రిప్‌లకు వెళుతున్నామని సోషల్ మీడియాలో పోస్టు పెడితే వాటిని చూసి.. ఆ ఇంటి అడ్రస్ కనుక్కుని మరీ తాళాలు బద్దలు కొట్టి బంగారం, ఆభరణాలు, నగదు దొంగిలించేవాడు.
పోలీసులు అతడిని అరెస్టు చేసినప్పుడు కూడా అతడి వద్ద నుంచి 1.26 లక్షల డబ్బు, 30 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు మనోడిపై గతంలోనే మూడు పోలీసు కేసులు ఉన్నాయి. గతంలో ఓ సారి జైలుకు వెళ్లి వచ్చినా ప్లేస్ మార్చాడే తప్పా తన బుద్ధి మార్చుకోలేదు.