మనిషి మెదడును తింటున్న గిరిజన తెగ.. ఎందుకోసమంటే..!

Update: 2023-01-05 12:07 GMT
నరమాంస భక్షకుల గురించి విన్నప్పుడు ఒక రకమైన భయాందోళన కలుగక మానదు. ఇలాంటి వాళ్లు చాలా అరుదుగా ఏ అడవుల్లోనో తలదాచుకుని కన్పించిన వారిపై దాడి చేసి భక్షిస్తుంటారు. చివరికి వీరంతా ఏదో ఒక భయంకరమైన రోగంతో మరణిస్తారు. ప్రస్తుతం భూమిపై నరమాంస భక్షకులు ఉన్నారో లేదో తెలియదు గానీ మనిషి మెదడు తినే ఒక తెగ మాత్రం ఉందని తాజాగా వెల్లడైంది.

యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజీ ప్రియాన్ యూనిట్ నుంచి జాన్ కాలింగ్ తన బృందం పాపువా న్యూ గినియాలో చేపట్టిన పరిశోధనలో మనిషి మెదడును తినే తెగ ఒకటి ఉందనే విషయం వెలుగు చూసింది. ఈ ప్రాంతంలో సుమారు 312 తెగలు నివసిస్తున్నాయి. వీరిలో ఒక తెగ విచిత్రమైన ఆచారాలకు ప్రసిద్ధి చెందినట్లు జాన్ కాలింగ్ బృందం గుర్తించింది.  

సైంటిఫిక్ ఫోర్ ట్రైబ్ తెగకు చెందిన వారంతా అంత్యక్రియల సమయంలో మనిషి మెదడును తింటున్నారని పరిశోధనలో తేలింది. ఈ తెగ వారు చనిపోయిన తమ బంధువుల మెదళ్లను ఆహారంలో చేర్చుకొని తింటున్నారు. దీని వల్ల ఈ తెగ ‘కురు’ అనే వ్యాధికి జన్యు నిరోధక శక్తిని పెంచుకున్నారని ప్రియాన్ యూనిట్ అధ్యయనంలో వెల్లడైంది.

కురు వ్యాధి ‘మ్యాడ్ కౌ’ వ్యాధిని పోలి ఉంటుంది. పార్కిన్సన్స్ వ్యాధి.. చిత్తవైకల్యం వంటి ‘ప్రియాన్’ వ్యాధులకు కొత్త చికిత్సలను కనుగొనడంలో ఈ పరిశోధన ఉపయోగపడే అవకాశం ఉందని జాన్ కాలింగ్ బృందం అభిప్రాయపడుతోంది. ఫోర్ తెగలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల సమయంలో మరణించిన వారి బంధువులు మాంసాన్ని తిని విందు చేసుకుంటారు.

మహిళలు మృత దేహంలోని మెదడును తింటారట. ఇది వారికి ప్రియమైన గౌరవ చిహ్నంగా పరిగణిస్తారట. పురుషులేమో మృతదేహం శరీర భాగాలు తింటారట. మృతదేహాన్ని ఖననం చేసిన.. సమాధి చేసినా కీటకాలు తింటాయని ఈ తెగ నమ్ముతుంది. చనిపోయిన వ్యక్తిని ప్రేమించిన వారు తినడం వల్ల మంచి కలుగుతుందని ఈ తెగ నమ్ముతుంది.

ఈ మేరకు ఈ గిరిజన తెగ స్త్రీలు మెదడును తీసి దానికి ఫెర్న్ వేసి వెదురులో వండుతారట. పిత్తాశయం తప్ప అన్నీ వేయించుకుని తింటారట. కానీ మనిషి మెదడులో ప్రాణాంతకమైన అణువు ఉందని.. అది తింటే మరణిస్తారనే సంగతి వీరికి తెలియదు. కాగా 1950లలో కురు వ్యాప్తి చెందిన తరువాత న్యూ గినియాలో మానవ మెదడును తినడం ప్రభుత్వం నిషేధించబడింది.

అయితే ఫోర్ తెగను పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలకు మెదడు తినే అలవాట్ల ఫలితంగా ఈ తెగ వారిలో కురు.. ప్రియాన్‌ల వల్ల కలిగే ఇతర వ్యాధులకు జన్యు రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందినట్లు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు అల్జీమర్స్.. పార్కిన్సన్స్ వంటి న్యూరో డిజె నెరేటివ్ వ్యాధులకు చికిత్సలు కనుగొనడంలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News