కవితను ఓడించిన వెన్నుపోటు ఎమ్మెల్యే అతడేనా?

Update: 2020-09-18 02:30 GMT
గత సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ సీఎం కేసీఆర్ కూతురు కవిత మాత్రం ఓడిపోయింది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్లక్ష్యమే కవిత ఓటమికి కారణం అనుకున్నారంతా..

కానీ ఒకే ఒక టీఆర్ఎస్ వెన్నుపోటు పొడిచాడని.. గంపగుత్తగా బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ కు ఓట్లు వేయించాడని టీఆర్ఎస్ అధిష్టానం లెక్కలతో సహా తేల్చిందట..

గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీగా పోటీచేసిన కవితకు 4.09 లక్షల ఓట్లు పడ్డాయి. అదే బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ కు 4.80లక్షల ఓట్లు పడ్డాయి. తేడా దాదాపు 70వేల ఓట్లు.

అయితే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓ అసెంబ్లీ సీటులో ఎమ్మెల్యే ఎన్నికల్లో 29900 మెజార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వచ్చిందట.. పార్లమెంట్ ఎన్నికల్లో అదే అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థికి ఏకంగా 72472 ఓట్లు పడ్డాయట..

దీంతో కవిత ఓటమికి కావాల్సిన ఓట్లన్నీ ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పడ్డాయట.. ఎంపీగా కవిత ఓటమికి పరోక్షంగా ఆయనే కారణమయ్యారట.. ఈ నియోజకవర్గంలో సరిగ్గా ఓట్లు పడి ఉంటే కవిత ఓడిపోయేవారు కాదని అధిష్టానం తేల్చేసిందట..

బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసుకున్నాడని.. వెన్నుపోటు పొడిచారని అధిష్టానం కనిపెట్టిందట.. ఈ మేరకు ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పూర్తి నివేదికలు తెప్పించుకున్న అధిష్టానం ఆ వెన్నుపోటు ఎమ్మెల్యేకు తొందరలోనే షాక్ ఇవ్వబోతోందట..
Tags:    

Similar News