దేశంలో భారీ ఎత్తున డబ్బున్న పార్టీలు ఏవీ అంటే.. అందరి వేళ్లూ.. ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ వైపే చూపిస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందడంలో టీఆర్ ఎస్.. దేశంలోని 42 ప్రాంతీయ పార్టీల్లోనే అగ్రగామిగా నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.130.46కోట్ల ఆదాయాన్ని విరాళాల రూపంలో ఆర్జించింది. ఇక, ఈ వరుసలో వైసీపీ మూడో స్థానంలో ఉంది. మొత్తం 42 పార్టీలపై ఏడీఆర్(అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) నివేదిక రూపొందించగా.. 14 మాత్రమే విరాళాల వివరాలను బయట పెట్టాయి.
2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆప్, డీఎంకే సహా 14 ప్రాంతీయ పార్టీలకు.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 447.49 కోట్లు విరాళాలుగా అందాయి. అన్నింటినీ కలుపుకొంటే.. ఆయా పార్టీల ఆదాయంలో ఈ మొత్తం 50.97 శాతం. ఏడీఆర్ ఈమేరకు ఓ నివేదిక రూపొందించింది. 2019-20 కాలానికి మొత్తం 42 ప్రాంతీయ పార్టీల ఆర్థిక వ్యవహారాలను విశ్లేషించింది. మొత్తం ఆదాయం రూ. 877.957 కోట్లుగా తేలింది. ఈ 42 పార్టీల్లో 14 మాత్రమే విరాళాల వివరాలను బయటపెట్టినట్టు ఏడీఆర్ స్పష్టం చేసింది.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందడంలో టీఆర్ ఎస్ టాప్లో నిలిచింది. ఆ పార్టీ ఆదాయం రూ. 130.46కోట్లు. విశ్లేషణకు పరిగణించిన అన్ని పార్టీల మొత్తం ఆదాయంలో ఒక్క టీఆర్ ఎస్ వాటానే 14.86శాతంగా ఉందని ఏడీఆర్ తెలిపింది. తర్వాతి స్థానాల్లో.. శివసేన(రూ. 111.403కోట్లు-12.69శాతం), వైసీపీ (రూ. 92.739కోట్లు-10.56శాతం) ఉన్నాయి. 39 పార్టీల మొత్తం ఆదాయం.. 2018-19(రూ. 1087.206కోట్లు) తో పోల్చుకుంటే.. 2019-20లో(రూ. 874.467కోట్లు) తగ్గింది. ఇది 19.57శాతంగా ఉందని ఏడీఆర్ స్పష్టం చేసింది.
2019-20లో అందిన ఆదాయాన్ని 24 ప్రాంతీయ పార్టీలు ఇంకా ఖర్చుపెట్టలేదు. టీఆర్ ఎస్ మొత్తం ఆదాయంలో 83.76శాతాన్ని ఇంకా ఖర్చు చేయలేదు. అన్నాడీఎంకే, జేజేపీకి 67.82(64శాతం) ఆదాయం మిగిలే ఉంది. 2019-20కి గాను 18 పార్టీలు.. తమ ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేశాయి. తెలుగు దేశం పార్టీ, బిజూ జనతా దళ్, డీఎంకే, ఎస్పీ, జేడీఎస్, ఏజేఎస్యూ, జేవీఎం-పీ, ఐఎన్ఎల్డీ, పీఎంకే, ఎంజీపీ, జీఎప్పీ, ఎస్డీఎఫ్, ఎంఎన్ఎఫ్, ఏఐఎఫ్బీ, ఎన్పీఎఫ్, జేకేపీడీపీ, ఐపీఎఫ్టీ, ఎంపీసీ ఈ జాబితాలో ఉన్నాయి. బీజేడీ ఎక్కువ ఖర్చు చేసింద(106.01శాతం/ రూ. 95.78కోట్లు)ని ఏడీఆర్ పేర్కొంది.