మునుగోడు బైపోల్స్: మూడు రౌండ్లు పూర్తి.. పుంజుకున్న బీజేపీ.. టీఆర్ఎస్ కు కేవలం 35 ఓట్ల ఆధిక్యం

Update: 2022-11-06 04:48 GMT
పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్ లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం కనబరచగా.. రెండో రౌండ్ లో కారు స్పీడుకు బ్రేకులు పడ్డాయి.  అనూహ్యంగా బీజేపీ దూసుకొచ్చి ఆధిక్యం సాధించింది. రెండో రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఓట్లు వచ్చాయి. ఇక మూడో రౌండ్ లో టీఆర్ఎస్ కంటే ఏకంగా 400 ఓట్లు పైచిలుకు ఓట్లు సాధించడం విశేషం. దీన్ని బట్టి మునుగోడులో టీఆర్ఎస్, వర్సెస్ బీజేపీ పోరు రసవత్తరంగా మారింది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టే మునుగోడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఊహించినట్టే టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలంగాణ రాజకీయాల హీట్ పెంచుతూ మునుగోడు వేడి మరింత రాజుకుంది. 93శాతం పోలింగ్ నమోదైన మునుగోడులో ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు.

నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు  ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నానికి తుది ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలోకి దిగారు.

ఇక తొలి రౌండ్ గా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. స్టల్ బ్యాలెట్ లో టీఆరెఎస్ ముందంజ వేసింది. 686 పోస్టల్ బ్యాలెట్.. 6సర్వీసు ఓటర్లు.. మొత్తం 692 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి 4 ఓట్ల ఆధిక్యం లభించింది. వీటితో టీఆర్ఎస్ కు 228 ఓట్లు రాగా.. బీజేపీకి 224, బీఎస్పీ అభ్యర్థికి 10 ఓట్లు వచ్చాయి.

ఇక తొలి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 2వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించిడం విశేషం. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 6069 ఓట్లు రాగా.. బీజేపీకి 4904 ఓట్లు, కాంగ్రెస్ కు 1887 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ లోనే టీఆర్ఎస్ ఏకంగా 1192 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా గులాబీ దండు మునుగోడులో పోటీనిస్తోంది. అయితే బీజేపీ కూడా బాగానే ఫైట్ ఇస్తోంది.

రెండో రౌండ్ లో రాజగోపాల్ రెడ్డి ఏకంగా 789 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. రెండో స్థానంలో టీఆర్ఎస్ ప్రభాకర్ రెడ్డి, మూడో స్థానంలో కాంగ్రెస్ స్రవంతి ఉన్నారు.

ఇక మూడో రౌండర్ లో టీఆర్ఎస్ కు 7010 ఓట్లు రాగా.. బీజేపీకి 7426 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ లో టీఆర్ఎస్ పై 416 పరుగుల ఆధిక్యాన్ని బీజేపీ సాధించడం విశేషం.

అయితే మొత్తంగా తొలి రౌండ్ , పోస్టల్ లో టీఆర్ఎస్ ఆధిక్యం చూపిస్తే మూడో రౌండ్ కు వచ్చేసరికి బీజేపీ ఆధిక్యం సంపాదించింది.  పోరు హోరా హోరీగా సాగుతోంది.
Tags:    

Similar News