ఓర్నీ.. జుట్టు కోసం అన్ని తిప్పలా ట్రంప్

Update: 2017-02-03 07:34 GMT
వయసు చూస్తే డెబ్బై. కానీ.. ట్రంప్ జుట్టు చూస్తేనే షాకిచ్చేలా ఉంటుంది. ఒత్తుగా కనిపించే జుట్టుతో ట్రంప్ వయసు తక్కువలో తక్కువ ఓ పదేళ్లు తగ్గినట్లుగా కనిపిస్తుంటారు. ట్రంప్ ముఖంలో ఆయన హెయిర్ స్పెషల్ అట్రాక్షన్ అన్న విషయం తెలిసిందే. నిండా ముప్ఫై దాటక ముందే బట్టతల వచ్చేస్తున్న వేళ.. డెబ్భై ఏళ్లు దాటాక కూడా జుట్టు చెదరకుండా ట్రంప్ ఎలా మొయింటైన్ చేస్తున్నారన్న డౌట్ చాలామందిలో ఉంది.

తాజాగా ఆ గుట్టు రట్టైంది. జుట్టు కోసం ట్రంప్ పడే తిప్పలు.. తీసుకునే శ్రద్ధ గురించి తెలిస్తే వామ్మో అనుకోవాల్సిందే. ఆయన జట్టుకు సంబంధించిన రహస్యాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడు రివీల్ చేశారు. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేసే ట్రంప్.. జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపించటమే కాదు.. జుట్టు పెరగటానికి వీలుగా ప్రత్యేక డ్రగ్ ను తీసుకుంటారని వెల్లడించారు.

సాధారణంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ డై హైడ్రో టెస్టోస్టిరాన్ గా మారుతుంది. ఇదే.. జుట్టు పెరగకుండా అడ్డుకుంటుంది. దీంతో.. పురుషుల్లో జుట్టు రాలిపోయి బట్టతల ఏర్పడుతుంది. దీంతో..జట్టును ఊడేలా చేసే డై హైడ్రో టెస్టోస్టిరాన్ గా మారకుండా ఉంచే డ్రగ్ ను ట్రంప్ నిత్యం తీసుకుంటారట. అంతే కాదు.. చర్మవ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేకమైన డ్రగ్ ను ట్రంప్ తీసుకుంటారని వెల్లడించారు. ఈ విషయాలన్నీ వెల్లడించిన డాక్టర్ హరాల్డ్ గడిచిన 36 ఏళ్లుగా ట్రంప్ కు వైద్యుడిగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. మొత్తానికి ట్రంప్ హెయిర్ సీక్రెట్ అయితే తెలిసిపోయినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News