ఒకే ఒక్కడు. ఆ ఒక్కడి కారణంగా యావత్ ప్రపంచం ఇప్పుడు గగ్గోలు పెట్టే పరిస్థితి. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాకు ఒక మూర్ఖుడు.. ఆవేశపరుడు.. ఈ శతాబ్దానికి ఏ మాత్రం సూట్ కానీ 70 ఏళ్ల ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మారటంతో చిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. చరిత్రలో పరమ మూర్ఖులైన దేశాధినేతల గురించి చదువుకునే వారంతా.. తమ తరంలోనే అలాంటి వ్యక్తిని చూడాల్సి రావటంతో చిరాకుపడిపోతున్నారు.
ఒకప్పుడు కలల దేశంగా.. ప్రపంచంలోని ప్రతి దేశం.. ఒక్కసారైనా అమెరికాకు వెళ్లి రావాలన్న ఆలోచనను ట్రంప్ చెడగొట్టేస్తున్నారని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతల్ని చేపట్టి రెండు వారాలు కూడా పూర్తి చేయని ట్రంప్ కారణంగా అమెరికా ఇమేజ్ కు దారుణమైన డ్యామేజ్ జరుగుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోకి ఉగ్రవాదులు చొరబడకుండా ఉండటం కోసం ఏడు ముస్లిం దేశాల మీద నిషేధం విదించటం.. అమెరికాకు ఉద్యోగాల కోసం హెచ్ 1 వీసాలపై వచ్చే వారికి మోకాలడ్డుతూ.. ఉద్యోగాలన్నీ అమెరికాకే అంటూ చిత్రవిచిత్రమైన వాదనల్నివినిపించటం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ కారణంగా అమెరికా ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.
ముస్లిం దేశాల మీద నిషేధం.. హెచ్ 1 బీ వీసాలపై పరిమితులు విధించటం ద్వారా అమెరికన్లకు ఉద్యోగాలు తీసుకురావటం సంగతి తర్వాత..అమెరికాకు వచ్చే బోలెడంత ఆదాయాన్ని ట్రంప్ దెబ్బ తీస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏడు ముస్లిం దేశాలపై విధించిన నిషేధం ఆ దేశాలకు మాత్రమే పరిమితం కాదని.. పలు దేశాలపైనా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
వస్తువులు.. సర్వీసులు.. విద్యార్థులు.. పర్యాటకుల రూపంలోనూ అమెరికాకు నష్టం వాటిల్లేఅవకాశం ఉందంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు విదేశీ పర్యాటకుల ఎంతో కీలకమని.. 2015లో ఇలాంటి వారి కారణంగా అమెరికాకు వచ్చిన ఆదాయం రూ.13.40లక్షల కోట్లుగా చెబుతున్నారు. ట్రంప్ ఆదేశాల కారణంగా ఎగుమతులతో పాటు.. విదేశీ పర్యాటకులు.. అమెరికా చదువుకోవటానికి వచ్చేవిద్యార్థులు వెనకడుగు వేస్తున్నారని.. ఇంతకాలం ఫ్రీ కంట్రీగా ఉంటూ మోస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ ఇమేజ్ ఉన్న యూఎస్.. ఇప్పుడు అన్ ఫ్రెండ్లీ కంట్రీ ఇమేజ్ ను మూట గట్టుకుంటుందని చెబుతున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మనోళ్లు అప్పుడెప్పుడో చెప్పిన సామెత గురించి ట్రంప్ తెలుసుకుంటే మంచిదేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/