గత ఎనిమిదేళ్లుగా కీలక పదవిలో పాతుకుపోయిన అధికారికి బదిలీ అయింది. టిటిడి జేఈవో శ్రీనివాసరాజును ఎపి ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరాజు ఎనిమిదేళ్ల పాటు టిటిడి జేఈవోగా పనిచేశారు. మరోవైపు వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఉన్న బసంత్ కుమార్ కు టిటిడి జేఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను ప్రభుత్వం ఆదేశించింది.
టీటీడీ ఈవోగా ఎవరున్నా కూడా జేఈవో శ్రీనివాసరాజు హవాయే నడిచేది. ముఖ్యమంత్రులు మారినా.. టీటీడీ చైర్మన్లు..ఈవోలు మారినా ఆయన మాత్రం అక్కడ పాతుకుపోయారు. ఇందుకు కారణం... దేశ రాజకీయాల్లో కీలకంగా ఉంటూ.. అనంతరం రాజ్యాంగ బద్ధ పదవిలో కొనసాగుతున్న ఏపీకి చెందిన నేత అండదండలు ఉండడం వల్లే ఆయన్ను ఎవరూ టచ్ చేయలేకపోయారని చెబుతారు.
ఆ నేతకు - టీడీపీకి మంచి సంబంధాలు ఉండడంతో మొన్నటి ఎన్నికల్లో శ్రీనివాసరాజు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారమూ జరిగింది. చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ నేత రోజాపై టీడీపీ శ్రీనివాసరాజును బరిలో దించుతుందని ఒక దశలో అంచనాలు వచ్చాయి. కానీ, అది జరగలేదు. అయితే.. శ్రీనివాసరాజు పూర్తిగా టీడీపీ మనిషన్న ఉద్దేశంతో ఆయన్ను తప్పించినట్లు చెబుతున్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తిరుమల పర్యటన సమయంలో అక్కడి వైసీపీ వర్గాల నుంచి జేఈవో శ్రీనివాస రాజు వ్యవహార శైలిపైన ఫిర్యాదులు అందాయి. శ్రీనివాసరాజు టీడీపీ మనిషని చెప్పారట. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సైతం జేఈవో తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు టీటీడీ కొత్త చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం జేఈవో శ్రీనివాస రాజును బదిలీ చేయాలని సీఎం ను కోరినట్లు చెబుతున్నారు. దీంతో జగన్ ఆయన్ను బదిలీ చేశారని చెబుతున్నారు. ఆయన స్థానంలో బసంత్ కుమార్ ను నియమించారు. బసంత్ కుమార్ గతంలో గవర్నరుకు ఓఎస్డీగా పనిచేశారు. గవర్నరు సిఫార్సుతోనే ఆయన్ను నియమించినట్లుగా చెబుతున్నారు.