హైదరాబాద్ డ్రగ్ రాకెట్ వ్యవహారం కాస్త సద్దుమణిగి అందరూ ఆ విషయాన్ని మరిచిపోతున్న దశలో బెంగళూరులో మన మాజీ ఎంపీ మనవడొకడు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికిపోయినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఆ కుర్రాడు ఆంధ్రా ప్రాంతానికి చెందిన మాజీ ఎంపీ.. వ్యాపార వేత్త కూడా అయిన ప్రముఖుడి మనవడని ఆ వార్తల ప్రకారం తెలుస్తోంది. అతను ఇద్దరు కన్నడ హీరోలతో కలిసి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడని ఆ కథనాల ద్వారా వెల్లడైంది. హైదరాబాద్ డ్రగ్ రాకెట్ బయటపడ్డాక ఇక్కడ ఇంతకుముందులా విచ్చలవిడిగా డ్రగ్స్ అందుబాటులోకి రావట్లేదు. ఈ వ్యవహారమంతా కొంచెం టైట్ అయింది. దీంతో సెలబ్రెటీలు వేరే నగరాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
మాజీ ఎంపీ మనవడు కూడా అందుకే బెంగళూరు బాట పట్టినట్లు ఆ వార్తల ప్రకారం తెలుస్తోంది. బెంగళూరు సిటీలోని సౌత్ ఎండ్ సర్కిల్ సమీపంలో బుధవారం రాత్రి ఓ లగ్జరీ కారును నిలిపి.. అందులోని వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం కొందరు స్థానికులు గుర్తించారని వినికిడి. ఐతే డ్రగ్స్ తీసుకోవడం పూర్తయ్యాక కారును విచ్చలవిడిగా నడిపారని ఆ కథనాల ప్రకారం తెలుస్తోంది. వీరి కారు ఢీకొనడంతో వేరే మూడు కార్లు.. ఒక జీపు దెబ్బ తిన్నాయని సమాచారం. ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో ఏర్పాటు చేసిన బోర్డును కూడా వీళ్ల కారు ఢీకొందట. దీంతో స్థానికులు ఈ కారును అడ్డగించి.. అందులోని ముగ్గురినీ బయటికి లాగి దేహశుద్ధి చేశారని వార్తలు వెలువడ్డాయి. ఆ ముగ్గురు కారు అక్కడే వదిలేసి పరారయ్యారని, ఐతే వీరు ఢీకొట్టిన ఓ కారు పల్టీలు కొట్టడంతో అందులోని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని వినికిడి. అందులో ఇద్దరు హీరోలు.. ఆంధ్రా మాజీ ఎంపీ తనయుడు ఉన్నట్లు తర్వాత వెల్లడైందట. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీరిని గుర్తించినట్లు తెలుస్తోంది.