తిమింగలం నోట్లోకి వెళ్లి , ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు మహిళలు !

Update: 2020-11-04 23:30 GMT
తిమింగలం ను దగ్గర నుండి చూస్తేనే ఒళ్లు ఒక్కసారిగా కూల్ అయిపోయితుంది. అలాంటిది ఆ తిమింగలం దాడి లో ప్రాణాలు కోల్పోయాం అనుకున్న సమయంలో , ఆ దేవుడి దయ తో ప్రాణాలతో బయటపడటంతో ఈ యువతిలిద్దరూ మాకు ఇది మరో జన్మే అని అనుకుంటున్నారు. ఈ భయంకరమైన ఘటన ను వీడియో తీశారు. భారీ తిమింగలం హటాత్తుగా నీటిలోంచి పడవపైకి దూకడంతో అందరూ ఆశ్చర్యపోయారు. త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడిన యువతులిద్దరికీ సాయం చేయడానికి హడావుడిగా కదిలారు. అదృష్టం కొద్దీ వారికి ఎటువంటి గాయాలు కాలేదు. వారి పడవ కూడా సురక్షితంగానే ఉంది.

తిమింగలం దాడిలో పడవలో షికారు చేస్తున్న స్నేహితురాళ్లిద్దరూ దాదాపు చనిపోయారనే అంతా భావించారు. వీరితో పాటు ఇతర పడవల్లో వెళ్తున్న పర్యాటకులైతే భయంతో వణికిపోయారు. కానీ అదృష్టం బాగుండటంతో ఆ మహిళలిద్దరూ బతికి ఊపిరి పీల్చుకున్నారు. జూలీ మెక్ ‌సోర్లీ, లిజ్ కాట్రియెల్ అనే ఇద్దరు మహిళలు కాలిఫోర్నియా చేరుకున్నారు. ఇక్కడి అవిలా బీచ్‌ లో తిమింగలాలను చూడటం కోసం వెళ్లారు. ఆ సమయంలోనే ఒళ్లుగగుర్పొడిచే ఘటన జరిగింది. సడెన్‌గా నీటిపైకి దూసుకొచ్చిన తిమింగలం వీరు వెళ్తున్న చిన పడవను నోట కరచుకుంది. వారిద్దరినీ దాదాపు మింగేసింది. అయితే చివరి క్షణంలో బయటకు ఊసేయడంతో జూలీ, లిజ్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో చేతిలో ఉన్న మొబైల్‌లో జూలీ వీడియో తీస్తోంది. తిమింగలం వారి పడవపై దాడి చేయడం, ఆ తర్వాత నీటిలోకి విసిరికొట్టడం అంతా ఈ వీడియోలో రికార్డయింది. అలాగే ఆ ప్రాంతంలో తిమింగలాలను చూడటం కోసం వచ్చిన ఇతర టూరిస్టులు కూడా ఈ ఘటనను వీడియో చూశారు.

తిమింగలం నోట్లో నుంచి బయటపడ్డ ఈ జంటకు చుట్టుపక్కల పర్యాటకులు సాయం చేశారు. అదృష్టంకొద్దీ వీరి పడవ కూడా తిమింగలం దాడి నుంచి తప్పించుకుంది. కొంచెం సేదతీరిన తర్వాత వీరిద్దరూ తమ పడవలోనే ఒడ్డుకు చేరుకున్నారు. తిమింగలం దాడి చేసినప్పుడు తమకు చావు తప్పదని భయపడ్డామని లిజ్ చెప్పింది. ఆ క్షణం నాకేమీ తోచలేదు. తిమింగలాన్ని పక్కకు నెట్టేద్దామనుకున్నా. అది అసాధ్యమే. కానీ నా మనసులో అదే మెదిలింది అని ఆమె వెల్లడించింది. తనకు మామూలుగానే తిమింగలాలంటే కొంచెం ఇష్టమని, కానీ ఇలా వాటిలో ఒకటి తనపై దాడి చేస్తుందని కలలో కూడా ఊహించలేదని జూలీ చెప్పింది. ఏది ఏమైనా జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎదురైందని ఈ స్నేహితులు అంటున్నారు.
Tags:    

Similar News