స్టాలిన్‌ కేబినెట్‌ లోకి వారసుడు

Update: 2022-12-13 03:54 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌ బాటలోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా నడవనున్నారు. స్టాలిన్‌ తన కుమారుడు, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్‌ ను తన కేబినెట్‌ లోకి తీసుకోవాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డీఎంకే యువజన విభాగం అధిపతిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఉదయనిధి చెన్నై నగర పరిధిలోని చేపాక్‌ – తిరువల్లికేని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కాగా ఇప్పటికే సచివాలయంలో ఉదయనిధి స్టాలిన్‌ కోసం ప్రత్యేకంగా చాంబర్‌ ను సైతం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 14న ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే మంత్రివర్గాన్ని కూడా ముఖ్యమంత్రి స్టాలిన్‌ విస్తరిస్తారని చెబుతున్నారు.

ఉదయనిధి స్టాలిన్‌ కు ప్రజలు, యువతతో అనుబంధం ఉండే శాఖను అప్పగించాలని డీఎంకే నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌ కు క్రీడలు, యువజన సర్వీసులు, ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల అమలు శాఖ బాధ్యతలు అప్పగించొచ్చని తెలుస్తోంది.

కాగా 45 ఏళ్ల ఉదయనిధి స్టాలిన్‌ ను ఇప్పటికే మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల షూటింగులో బిజీగా ఉండటంతో మంత్రి వర్గంలో చేరడానికి ఆలస్యమైందని అంటున్నారు.
మంత్రిగా బాధ్యతలు చేపడితే ఉదయనిధి ఇక సినిమాలకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఉదయనిధికి చెందిన రెడ్‌ జెయింట్స్‌ నిర్మాణ సంస్థ పెద్ద ఎత్తున సినిమాలను నిర్మిస్తోంది.

అయితే గతంలో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్‌ ను డీఎంకే నేతలు తీవ్రంగా విమర్శించేవారు. ముఖ్యమంత్రి, సూపర్‌ స్టార్‌ అంటూ ఎద్దేవా చేసేవారు. అయినా ఎంజీఆర్‌ జీవించి ఉన్నంతవరకు అన్నాడీఎంకే ముందు డీఎంకే ప్రభ కొనసాగలేదు.

ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌ అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో కొనసాగితే డీఎంకే నేతలకు ఇబ్బందులు తప్పవు. అన్నాడీఎంకే నేతలు తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌ తో సినిమాలు మానిపించి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగేలా చేయాలనే వ్యూహంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 14న పవిత్ర తమిళ మాసమైన కార్తిగై చివరి రోజు, ఉదయం 9.30 గంటలకు ఉదయనిధి స్టాలిన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని అధికారిక ప్రకటన జారీ చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News