రాజకీయాల్లో నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసే మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ సంచలన కామెంట్ చేశారు. ప్రత్యేక హోదా బిల్లుపై ఈ రోజు పార్లమెంటులో జరిగిన పరిణామాలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిల్లు చర్చకు రాకుండా అడ్డుకోవడాన్ని ఏకంగా రేప్ తో పోల్చారు. ఏపీని రేప్ చేశారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు చర్చకు రాకుండా అడ్డుకోవడంపై ఆయన చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీపై అత్యాచారయత్నం మాత్రమే జరిగిందని ఈ రోజు మాత్రం ఏకంగా రాష్ట్రాన్ని రేప్ చేసేశారని ఆయన అన్నారు.
ఏపీ అంటే కేంద్రానికి ఎంత చిన్నచూపు ఉందో ఈరోజు తేటతెల్లమైందన్నారు. ఒక ఎంపీ పార్లమెంట్ లో వీడియో తీయడాన్ని అడ్డుపెట్టుకుని … ఒక రాష్ట్ర సమస్యను పక్కనపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. చేసిన చట్టాన్ని అమలు చేయాల్సిందిగా కోరుతూ బిల్లు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించడం దురదృష్టకరమన్నారు. ఏపీ పీకనొక్కి కనీసం మంచినీళ్లు కూడా పోయడం లేదని ఆవేదన చెందారు.
ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెసే కారణమని టీడీపీ విమర్శించడాన్ని ఉండవల్లి తప్పుపట్టారు. పాపం చేసింది కాబట్టే ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోయిందని కూడా ఆయన అన్నారు. రెండు శాతం ఓట్లు కూడా రాకుండా ప్రజలు చంపేశారని కాంగ్రెస్ పాపాన్ని ప్రస్తావించారు.. చచ్చిపోయిన కాంగ్రెస్ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు టీడీపీ - బీజేపీ ఏం చేస్తున్నాయో చెప్పాలన్నారు. ఇదంతా ఎలా ఉన్నా అరుణ్ కుమార్ వ్యాఖ్యలపై మాత్రం కలకలం రేగుతోంది.