షాకింగ్ మాట‌లు చెప్పిన సీఎం యోగి

Update: 2017-05-22 08:39 GMT
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. కొంద‌రికి ఒళ్లు మండేలా మాట్లాడ‌టం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ తాజాగా ఆ త‌ర‌హాలో కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి కావ‌టానికి ముందు క‌ర‌డుగ‌ట్టిన హిందుత్వ‌వాదిగా వ్య‌వ‌హ‌రిస్తూ.. సంఘ్‌ను మీద వేసుకొని తిరిగే వారు. యూపీ సీఎం అయ్యాక ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌ల‌న్నీ ఆచితూచి అన్న‌ట్లే ఉండేవి.

అందుకు భిన్నంగా తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కొంద‌రికి మోదంగా మ‌రికొంద‌రికి ఖేదంగా మార‌టం ఖాయం. ఇంత‌కీ యోగి నోటి నుంచి వ‌చ్చిన తాజా వ్యాఖ్య‌లు ఏమిటంటే.. ఆర్ఎస్ఎస్ కానీ లేకుంటే దేశంలో కీల‌క‌మైన మూడు రాష్ట్రాలు పాకిస్థాన్‌లో ఉండేవ‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించారు. ప్ర‌పంచంలో ఎలాంటి స్వార్థం లేకుండా సేవ అందించే ఏకైక సంస్థ‌గా ఆర్ఎస్ఎస్‌ను ఆకాశానికి ఎత్తేసిన యోగి.. ఆ సంస్థ‌లో ప‌ని చేసే వారిని విప‌రీతంగా పొగిడేశారు.
సంఘ్‌లో ప‌ని చేసే స్వ‌యం సేవ‌కులు.. ప్ర‌చార‌క్‌లు నిస్వార్థంగా ప‌ని చేస్తుంటార‌న్న ఆయ‌న‌.. దేశానికి.. సంస్కృతికి సేవ‌లు అందిస్తుంటార‌న్నారు. ఎలాంటి ప్ర‌తిఫ‌లాన్ని ఆశించ‌కుండా దేశానికి.. దేశ సంస్కృతికి నిస్వార్థంగా సేవ‌లు అందించే ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్‌ గా కొనియాడారు. ఆర్ ఎస్ఎస్ కానీ.. ఆ సంస్థ‌కు కీల‌క‌మైన డాక్ట‌ర్ శ్యాంప్ర‌సాద్ ముఖ‌ర్జీ కానీ లేకుంటే పంజాబ్‌.. క‌శ్మీర్‌.. ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాలు పాకిస్థాన్లో ఉండేవ‌న్నారు. దేశంలో అతి పెద్ద జాతీయ‌వాద సంస్థ‌గా సంఘ్‌ను అభివ‌ర్ణించారు. మ‌రి.. యోగి మాట‌ల‌కు విప‌క్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
Tags:    

Similar News