తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పెద్ద‌ల వ‌రుస ప‌ర్య‌ట‌న‌ల ఆంత‌ర్య‌మిదేనా?

Update: 2022-07-03 05:37 GMT
ఓవైపు తెలంగాణ‌లో ఓవైపు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు.. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అల్లూరి సీతారామ‌రాజు కాంస్య విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ వేళ బీజేపీ పెద్ద‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వ‌రుస ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీకారం చుడుతున్నారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్ లో బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు మొద‌ల‌య్యాయి. వీటికి ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స‌హా ప‌లువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు.

ప‌నిలో ప‌నిగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద రద్దీ పెరిగింది. గ్రేటర్ ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయం గురించి పదే పదే ప్రస్తావించారు. ఆ ఎన్నికల సమయంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సహా పలువురు బీజేపీ నేతలు పాత‌బ‌స్తీలో ఉన్న భాగ్మలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ కార్యవర్గ సమావేశాల సమయంలోనూ పలువురు కీలక నేతలు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. తాజాగా.. ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తో పాటుగా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

ముస్లిం మైనారిటీలు అధికంగా పాత‌బ‌స్తీలో భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డం ద్వారా హిందువుల‌ను త‌మ పార్టీ వైపు పూర్తి స్థాయిలో ఆక‌ర్షించ‌డ‌మే బీజేపీ ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఏడాది జ‌రనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా హిందూ ఓట్ల‌ను గంప‌గుత్త‌గా కొల్ల‌గొట్ట‌డ‌మే బీజేపీ ధ్యేయమ‌ని అంటున్నారు.

కాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా జూలై 3 రెండో రోజు ప్రధాని న‌రేంద్ర‌ మోదీ కీలక ప్రసంగం చేస్తార‌ని తెలుస్తోంది. సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్ ఇందుకు వేదిక కానుంది. ముఖ్యంగా కేసీఆర్ ప్ర‌భుత్వం, టీఆర్ఎస్ పై ప్ర‌ధాని ఘాటు వ్యాఖ్య‌లు చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే తెలంగాణపై ప్ర‌త్యేక తీర్మానాన్ని కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెడ‌తార‌ని పేర్కొంటున్నారు.

ఇక జూలై 4న ప్రధాని ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌శ్చి మ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం స‌మీపంలో కాళ్ల మండ‌లం పెద అమిరంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. అక్క‌డ విప్ల‌వ వీరుడు 30 అడుగుల‌ అల్లూరి కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీలు జీవీఎల్ న‌ర‌సింహారావు, సీఎం ర‌మేష్, వైఎస్సార్సీపీ న‌ర‌సాపురం రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు త‌దిత‌రులు పాల్గొన‌నున్నారు. ఇక గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో ప్ర‌ధాని మోదీకి గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్, ఇత‌ర మంత్రులు స్వాగ‌తం ప‌లుకుతార‌ని చెబుతున్నారు. అలాగే గ‌న్న‌వ‌రం నుంచి హెలికాప్ట‌ర్ లో ప్ర‌ధానితో క‌లిసి సీఎం జ‌గ‌న్ ప్ర‌యాణిస్తార‌ని తెలుస్తోంది.

భీమ‌వ‌రంలో ఇప్ప‌టికే కేంద్ర‌, రాష్ట్ర భ‌ద్ర‌తా ద‌ళాలు ముమ్మ‌ర త‌నిఖీలు చేస్తున్నాయి. 16 ఎక‌రాల్లో ల‌క్ష మంది ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యేందుకుగా వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి సంద‌ర్భంగా ఆజాదీ అమృత్ మ‌హోత్సవ్ లో భాగంగా అల్లూరి సీతారామ‌రాజు విగ్రహాన్ని మోదీ ఆవిష్క‌రించనున్నారు.

వేదికపై ప్రసంగాలను వీక్షించేందుకు గ్యాలరీలతోపాటు భీమవరం టౌన్ పరిసరాల వరకు ఎల్‌ఈడీ స్క్రీన్లు సిద్దం చేశారు. ప్రధాని రాకపోకలకు వీలుగా నాలుగు హెలిప్యాడ్లు సిద్దం అయ్యాయి. ప్రధాని వేదికతో పాటుగా సమీపంలోనే మరో వేదిక సిద్దం చేసారు. ఆ వేదికపైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Tags:    

Similar News