ఇంతకాలం కొన్ని విషయాల మీద బహిరంగంగా మాట్లాడుకోవటం.. మరికొన్ని విషయాల్ని మొహమాటపు పరదాలను కప్పుకోవటం.. లేదంటే లౌకిక ముసుగులో చేసిన దుర్మార్గపు రాజకీయకు ముసుగులు తొలిగిపోతున్నాయి. దీంతో.. కుహనా లౌకికవాదులకు ఒక పట్టాన మింగుడుపడటం లేదు. దేశంలో ఏదో అశాంతి ఉందని.. దాన్ని తట్టుకోలేకపోతున్నట్లుగా మాట్లాడటం మేధావితనానికి నిలువెత్తు రూపంగా భావిస్తున్నారు. వామపక్ష భావజాలం.. తాము దశాబ్దాల తరబడి చెప్పిన అబద్ధాల లెక్కలు తేలిపోవటంతో.. వారు గగ్గోలు పెడుతున్నారు. ఏదో అన్యాయం జరిగినట్లుగా గావు కేకలు వేస్తున్నారు.
ఒక దేశంలో అందరూ సమానమైనప్పుడు మెజార్టీల కంటే మైనార్టీల కు ఎక్కువగా హక్కులు ఉండాల్సిన అవసరం ఏమిటి? మెజార్టీలు ఏదైనా దుర్మార్గానికి తెగబడితే దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో మీడియాలో ప్రముఖంగా ప్రచురించే మీడియా సంస్థలు.. అదే మైనార్టీలు అలాంటి పనే చేస్తే.. దాన్ని కవర్ చేయాల్సిన అవసరం ఏమిటి? తప్పు ఎవరు చేసినా తప్పే? ఒకరు చేసిన తప్పును సదరు వ్యక్తి మెజార్టీనా? మైనార్టీనా? అంటూ చూసి.. దానికి మతం రంగును ఎందుకు పులమాలి? ఇలాంటి వేషాలతోనే దేశంలో కనిపించని విభజన రేఖ గీయటంతో పాటు.. అసమానతల్ని అంతకంతకూ పెంచేలా చేశారని చెప్పాలి.
పదే పదే ప్రస్తావించారనటం కాదు కానీ.. కశ్మీరీ వ్యాలీలో లక్షలాది మంది హిందువులను కట్టుబట్టలతో వారు పుట్టిన గడ్డ నుంచి తరిమి తరిమి కొట్టిన వైనాన్ని ఏమనాలి? ఎలా చూడాలి? అప్పుడెందుకు ఈ లౌకికవాదులు.. బుద్ధిజీవులు.. మేధావులు ఎందుకు మాట్లాడలేదు? వారిని వారి ప్రాంతాలకు తిరిగి పంపి.. బతికేలా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అన్న ప్రశ్నలకు సమాధానం లభించదు.
ఇప్పుడు ఒక బీజేపీ ఎంపీ అన్న మాటల్ని.. భూతద్దంలో చూపించి ఇంత దారుణంగా మాట్లాడతారా? అని గుండెలు బాదుకుంటున్నారు. మరి.. ఆ మాటలకు కారణమైన వ్యాఖ్యల్ని మాత్రం పట్టించుకోకపోవటం చూస్తే.. దేశంలో కొన్ని విషయాలకు ఇచ్చే ప్రాధాన్యత.. మరికొన్నింటికి ఇవ్వటం లేదని చెప్పక తప్పదు. అలీఘర్ బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్ ఒక వ్యాఖ్య చేశారు. భారత్ లో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్న వారు పాకిస్తాన్ కు వెళ్లి పోవచ్చన్నారు. ఈ మాట అన్నంతనే.. ఇంత మాట అంటారా? ఎంత దారుణం అంటూ శోకాలు పెట్టే బదులు.. సదరు ఎంపీ మాటలకు కారణమైన ప్రముఖ కవి మునవ్వార్ రాణా కుమార్తె సుమైయా మాటల్ని కూడా పరిగణ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ మధ్యన ఆమె.. దేశంలో పరిస్థితులు బతికేందుకు అనువుగా లేవని.. ఇక్కడ ఉండలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేసింది. మరి.. ఆమె మాటలకు సమాధానం చెప్పటమే తప్ప అన్నట్లు మాట్లాడేవారు.. దేశంలో నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అన్నది కూడా ముఖ్యమే కదా? ఏదో జరిగిపోతున్నట్లుగా భయాందోళనల్ని క్రియేట్ చేయటం.. బతక లేక పోతున్నట్లుగా డ్యామేజింగ్ గా మాట్లాడటం కూడా దుర్మార్గమే కదా? ఎవరికైనా వారికి అర్థమయ్యే భాషలో చెబితేనే వెంటనే అర్థమవుతుంది కదా? అది కూడా తప్పంటారేమిటి లౌకిక మేధావులు?