బాలీవుడ్ మెరుపుతీగ ఊర్మిలకు తమ కండువా వేసింది కాంగ్రెస్ పార్టీ. జనాలు దాదాపుగా మరిచిపోయిన ఈ హీరోయిన్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసింది. చాలా మంది హీరోయిన్లు ఈ తరహాలో రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరంపరలో ఇప్పుడు ఊర్మిల వంతు వచ్చినట్టుగా ఉంది.
ఈ ఎన్నికల్లోనే పలువురు బాలీవుడ్ అందాల తారలు తమ లక్ ను పరీక్షించుకోబోతున్నారు. హేమమాలిని, జయప్రద వంటి వాళ్లు బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. ఇక దక్షిణాదిన పలువురు హీరోయిన్లు కాంగ్రెస్ తరఫున నిలుస్తున్నారు. నగ్మా, కుష్ బూ ,విజయ్ శాంతివంటి వారు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఊర్మిల కూడా ఆ జాబితాలో చేరింది.
ఊర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేయనుందని స్పష్టం అవుతోంది. ఈమె ముంబై నార్త్ సీటు నుంచి పోటీ చేస్తుంది అనేది బాగా వినిపిస్తున్నమాట. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిన ముంబై నార్త్ నుంచి ఈ సారి ఊర్మిల పోటీ చేస్తుందట.
విశేషం ఏమిటంటే.. ఈ నియోజకవర్గం నుంచి గతంలో బాలీవుడ్ స్టార్ ఒకరు ప్రాతినిధ్యం వహించారు. ఆయనే గోవిందా. ఈ బాలీవుడ్ స్టార్ హీరో రెండు వేల నాలుగులో ముంబై నార్త్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. రాంనాయక్ వంటి సీనియర్ బీజేపీ నేత ను ఓడించి గోవింద విజయం సాధించారు. అయితే ఆ ముచ్చట ఒకసారికే పరిమితం.
రెండోసారి గోవిందాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. సంజయ్ నిరుపమ్ పోటీ చేసి నెగ్గారు. అయితే ఆయన గత ఎన్నికల్లో శివసేన-బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడారు. ఈ సారి అక్కడ నుంచి పోటీ చేయడానికి ఆ సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధంగా లేరట. అందుకే ఊర్మిలను బరిలోకి దించుతున్నారని సమాచారం. మరి గతంలో గోవింద గెలిచిన సీట్లో ఇప్పుడు ఊర్మిల నెగ్గగలదేమో చూడాలి!