ఇక పై లాలాజలం తోనూ కరోనా టెస్టులు.. !

Update: 2020-08-18 01:30 GMT
కరోనా పరీక్ష విధానంలో త్వరలో మరో కొత్త విధానం రానుంది. లాలాజలంతోనూ పరీక్షలు నిర్వహించే 'సలైవా టెస్టు పద్ధతిలో చేపట్టనున్నారు. భారత్ లో అధికంగా ముక్కు ద్వారా, గొంతు ద్వారా శ్వాబ్ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాపిడ్ టెస్ట్, పీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్ విధానాల ద్వారా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. అయితే ఈ పరీక్షలు ఎంతో ప్రహసనం తో కూడినవి. వైద్యులు అత్యంత జాగ్రత్తగా రోగుల నుంచి గొంతు ద్వారా, ముక్కు ద్వారా శ్వాబ్ సేకరించాల్సి ఉంటుంది. పరీక్షల కోసం ఏ మాత్రం దగ్గరికి వెళ్లినా వ్యాధి బారిన పడే అవకాశం ఉండటంతో వైద్యులు కూడా టెస్ట్ చేయడానికి జంకుతున్నారు. దూరంగా కిటికీల పక్కన కూర్చొని, అద్దాల కియోస్క్ లను ఉపయోగించి పరీక్షలు చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఈ ఈ పరీక్షల అన్నిటికంటే కొత్తగా వచ్చిన విధానం మెరుగ్గా ఉంది. కేవలం లాలాజలం సేకరించి అతి తక్కువ ఖర్చుతో, కచ్చితత్వంతో చేపట్టే పరీక్ష విధానానికి అమెరికా ఎఫ్ డీఐ అనుమతి ఇచ్చింది. ఈ నూతన విధానం ద్వారా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెరగనుంది. తక్కువ ఖర్చు కావడం, సులువుగా లాలాజలం తీసుకోవచ్చు కాబట్టి పరీక్షల సంఖ్య మరింతగా పెంచవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో కూడా ఈ విధానం అతి తొందర్లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కరోనా టెస్టుల్లో అవలంభిస్తున్న విధానం ప్రకారం శ్వాబ్ తీసే వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉం డడం, శ్వాబ్ సేకరించడం, నమూనాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉండడం, ల్యాబ్ లో ఫలితం రావడానికి సమయం పట్టడం జరుగుతోంది. కొత్త విధానం అందుబాటులోకి రావడం ద్వారా ఈ సమస్యలు తీరని ఉన్నాయి. వేగంగా ఫలితం తెలుసుకోవడం ద్వారా ట్రీట్మెంట్ కూడా తొందరగా మొదలు పెట్టేందుకు అవకాశం ఏర్పడనుంది.
Tags:    

Similar News