కశ్మీర్ వివాదం నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ ల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ తో అన్ని సంబంధాలను తెంచుకొని పాకిస్తాన్ దుందుడుకుగా ముందుకెళుతున్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దుతోపాటు కశ్మీర్ విభజన తర్వాత జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది.
భారత్ తమను సంప్రదించకుండానే కశ్మీర్ ను విభజించడం.. కేంద్ర ప్రాంతాలుగా చేయడంపై అమెరికా ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని అమెరికా ఉన్నతాధికారి తాజాగా తెలిపారు. పాకిస్తాన్ బెదిరింపు ధోరణిని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. అస్థిరత నెలకొనే అవకాశం ఉండడంతో ఇరు దేశాల వైఖరిపై ఆరాతీస్తున్నామని అమెరికా అధికారి వివరించారు.
జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న ఆంక్షలపై అమెరికా సెనేటర్ మెనెండేజ్ - కాంగ్రెస్ అధికారి ఇలియట్ ఏంజెల్ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్ పై పాకిస్తాన్ ప్రతీకారచర్యలకు పాల్పడకూడదని వారు స్పష్టం చేశారు. అంతేకాదు చొరబాట్లను ప్రోత్సహించరాదని కూడా హెచ్చరించారు. పాకిస్తాన్ తన భూభాగంలోని ఉగ్రవాదులను ఏరిపారేయాలని పాకిస్తాన్ కు సెనేటర్లు సూచించారు. భారత్-పాక్ సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు ప్రతి ఒక్క దేశం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
*పోరుకు పాకిస్తాన్ రెడీ
కాగా కశ్మీర్ ను విభజించడంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దౌత్యపోరుకు రెడీ అయ్యారు. తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ విషయంలో తమకు న్యాయం చేసేలా సపోర్టు చేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ - సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ లను కోరాడు.
*గగనతలాన్ని మూసివేసిన పాకిస్తాన్
కశ్మీర్ ను విభజించడం.. ఆ తర్వాత ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ భారత్ పై ఒత్తిడి పెంచే చర్యలకు దిగుతోంది. ఇప్పటికే భారత్ తో దౌత్య - వాణిజ్య సంబంధాలను తెంచుకుంది. అనంతరం తాజాగా పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేసింది. పాకిస్తాన్ గుండా వెళ్లే 12 గగనతల మార్గాల్లో మూడింటిని మూసివేసింది.
కాగా గగనతలాన్ని మూసివేయడం వల్ల తమకు ఎటువంటి దూరం పెరగదని.. కేవలం 12కిలోమీటర్లు మాత్రమే దూరమైందని భారత వాయుసేన అధికారులు తెలిపారు. గతంలో బాలాకోట్ పై భారత్ దాడి తర్వాత కూడా పాకిస్తాన్ ఇలానే మూడు నెలలపాటు తన గగనతలాన్ని మూసివేయడం విశేషం.
ఇక ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశమై భారత్ తో ఉన్న వాఘా సరిహద్దును మూసివేయాలని కమిటీ నిర్ణయించింది. భారత రాయబారిని బహిష్కరించింది. భారత్ లో ఉండాల్సిన రాయబారిని పంపకూడదని కూడా నిర్ణయించింది.